Chiranjeevi, Raghuveera Reddy Arrested in Rajahmundry

Chiranjeevi raghuveera reddy arrested in rajahmundry

Chiranjeevi Arrested in Rajahmundry, Raghuveera Reddy Arrested in Rajahmundry, Chiranjeevi Arrested in Rajahmundry, Chiranjeevi Arreste in Rajahmundry airport, Mudragada, Chiranjeevi Arrested, Raghuveera Reddy Arrested

Chiranjeevi, Raghuveera Reddy Arrested in Rajahmundry: Congress leaders Chiranjeevi and Raghuveera Reddy Arrested in Rajahmundry Airport.

రఘవీరారెడ్డి, చిరంజీవిలు అరెస్ట్

Posted: 02/08/2016 12:29 PM IST
Chiranjeevi raghuveera reddy arrested in rajahmundry

కాపులకు రిజర్వేషన్ల విషయంలో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన కుటుంబ సభ్యులతో కలిసి గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. ఇందులో ప్రభుత్వ ప్రతినిధులుగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, పపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చర్షలు జరుపుతున్నారు.

ముద్రగడ దంపతుల ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి, చర్చలకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో ముద్రగడను పరామర్శించడానికి ఈరోజు ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఎపి పీసిసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిలను పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిని ఎయిర్ పోర్ట్ లోనే పోలీసులు అరెస్ట్ చేయడంతో... తమ నేతలను విడిచిపెట్టాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ సమీపంలో నిరసనలు చేస్తున్నారు.

అయితే ఇలా పరామర్శించడానికి వస్తున్న నేతలు, నాయకులను పోలీసులు అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం అన్యాయమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వున్న సమయంలో ఇలా తామేప్పుడు అడ్డుపడలేదని, ప్రజలు రోడ్డుపై నిరసనలు చేసారు తప్ప... నిరసనలకు ముందుగానే అరెస్ట్ చేయడం అడ్డుకోవడం వంటివి చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Raghuveera Reddy  Arrested  Rajahmundry airport  

Other Articles