Muncipal Branch | KTR | Notification issued | TRS Party | KCR | GHMC | News

Notification issued for ktr post

Notification issued for KTR post, KTR muncipal Branch, KTR latest news, KTR muncipal branch news, KCR Press meet, GHMS muncipal leader, KTR latest updates, TRS party latest news, KCR

Notification issued for KTR post: TRS Party won this year GHMC 2016 elections with highest majority. KCR orders issued for KTR Muncipal branch post.

కెటీఆర్ పదవికి ఉత్తర్వులు జారీ

Posted: 02/08/2016 09:51 AM IST
Notification issued for ktr post

ఇటీవలే జరిగిన GHMC ఎన్నికల్లో తెలంగాణ పార్టీ గత చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా 99 డివిజన్లను సొంతం చేసుకొని, కొత్త రికార్డును క్రియేట్ చేసింది. GHMC ఎన్నికల ప్రచార బాధ్యతను కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించగా... ఊహించని రీతిలో విజయం సాధించి, ప్రతిపక్షాలకు కారు జోరు చూపించి షాక్ కు గురిచేసింది. ఈ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖను తన తనయుడు కేటీఆర్ కు అప్పగించారు.

ప్రస్తుతం పంచాయతీ రాజ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలను నిర్వహిస్తున్న కేటీఆర్ కు అదనంగా మున్సిపల్ శాఖను కేటాయించారు. ఈ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరో కీలక శాఖ కేటీఆర్ ఆధీనంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో కేటీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి వీలుగా ఆయనకు మున్సిపల్ శాఖను బదలాయిస్తానని ప్రకటించారు. అదే క్రమంలో బిజినెస్ రూల్స్ మేరకు శాఖను కేటీఆర్ పరిధిలోకి బదలాయిస్తూ ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  Muncipal Branch  GHMC Notification issued  KCR  

Other Articles