Mudragada Padmanabham second day hunger strike going on

Mudragada padmanabham second day hunger strike going on

Mudragada Padmanabham, kapu reservations, Kapu, Mudragada

Mudragada Padmanabham second day hunger strike going on. A defiant Kapu leader, Mudragada Padmanabham, the four-time MLA and one-time MP, holds the record of holding ministerial berths in both the TDP and Congress governments headed by N.T. Rama Rao and M. Chenna Reddy.

ITEMVIDEOS: రెండో రోజుకు చేరిన ముద్రగడ నిరాహార దీక్ష

Posted: 02/06/2016 11:30 AM IST
Mudragada padmanabham second day hunger strike going on

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో నిరవధిక నిరాహార దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభం దీక్ష రెండో రోజుకు చేరింది. ముద్రగడ తన స్వగ్రామమైన కిర్లంపూడితో తన భార్యతో కలిసి నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. కాగా నిన్నటి దీక్షతోనే ముద్రగడకు షుగర్ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. వైద్య బృందం ప్రతి 3గంటల కోసారి ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముద్రగడ దంపతులిద్దరి బీపీ, షుగర్, పల్స్, బరువులను పరీక్షించగా, బీపీ, షుగర్ లెవల్స్లో స్వల్పంగా తరుగుదల కనిపించిందని వైద్యులు వెల్లడించారు. ముద్రగడ భార్య పద్మావతి షుగర్ లెవల్ 80కి చేరుకుందనీ, నేడు 70కి చేరే అవకాశం ఉందని వారు చెప్పారు. ఆమె వయస్సు రీత్యా షుగర్ లెవల్స్ తగ్గడం మంచిది కాదన్నారు.

కాగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతోపాటు మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు తదితరులను కూడా సీఎం తన వద్దకు పిలిపించారు. ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తో కలసి కాపుఉద్యమం, ముద్రగడ వ్యవహారంపై అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ ఉద్యమం తీవ్రతను వివరించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా బాబు ఒక్కసారిగా భగ్గుమన్నారు. దీక్షకు దిగకుండా ముద్రగడను ఒప్పించడంలో విఫలమయ్యారని వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు నిన్న రాత్రి ముద్రగడతో చర్చలు జరిపారు. ముద్రగడ చెప్పిన అంశాలను ఇవాళ సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు భాస్కరరావు తెలిపారు.

మరో పక్క గుంటూరు జిల్లా మంగళగిరిలో ముద్రగడపద్మనాభం చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా... దీక్షలకు దిగారు. ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా మంగళగిరిలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న కాపు సోదరులను పోలీసులు అడ్డుకున్నారు. కాపులను బీసీలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేయడానికి యత్నించిన కాపులను పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసుల తీరును నిరసిస్తూ.. ధర్నా నిర్వహించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada Padmanabham  kapu reservations  Kapu  Mudragada  

Other Articles