KTR will decide the mayor candidate from TRS

Ktr will decide the mayor candidate from trs

KTR, KCR, TRS, mayor, GHMC, GHMC Mayor

KTR campaign for GHMC elections very effectively. KCR also impressed with KTR work

కేటీఆర్ చెప్పిన వ్యక్తికే మేయర్ పోస్ట్

Posted: 02/06/2016 09:39 AM IST
Ktr will decide the mayor candidate from trs

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఎవరి మద్దతు లేకుండానే సొంతంగా బల్డియా పీఠానన్ని అదిరోహించనుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గ్రేటర్ లో టీఆర్ఎస్ అభ్యర్ధులు సత్తా చాటారు. అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పడు అందరిలో ఒకటే చర్చ. నగర మేయర్ పదవి ఎవరిని వరిస్తుందోనని ఒకటే ఉత్కంఠ. టీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పలువురు అభ్యర్థులు గ్రేటర్ పీఠం తమదేనని ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. కానీ టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఎవరివైపు మొగ్గుచూపుతారో అర్ధం కావడంలేదు.

గ్రేటర్ లో అన్ని తానై పార్టీని నడిపించి గెలుపు తీరాలకు చేర్చిన కేటీఆర్ సూచించిన అభ్యర్థికే కేసీఆర్ మేయర్ పీఠం బాధ్యతలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. తొలుత మేయర్ అభ్యర్ధిగా సీనియర్ లీడర్ కేకే కూమార్తే పేరు వినిపించినప్పటికి.... మరోవైపు దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) కుమార్తె విజయారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఖైరతాబాదు డివిజన్ నుంచి బరిలోకి దిగిన విజయారెడ్డి, ఎన్నికల్లో 16,341 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పీజేఆర్ కూతురుగానే కాక టీఆర్ఎస్ నేతగా ఆమె అభ్యర్థిత్వాన్ని ఎవరూ కాదనే పరిస్థితి లేనట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  KCR  TRS  mayor  GHMC  GHMC Mayor  

Other Articles