TRS scores landslide win in Greater Hyderabad polls

Trs scores landslide win in greater hyderabad polls

KCR, GHMC, TRS, KTR, GHMC Elections, GHMC Results

TRS scores landslide win in Greater Hyderabad polls

గ్రేటర్ చరిత్రలో నిలిచేలా టిఆర్ఎస్ గెలుపు

Posted: 02/05/2016 07:40 PM IST
Trs scores landslide win in greater hyderabad polls

అనుకున్నట్టుగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చాయి. మొదటి నుంచి బల్దియా ఎన్నికలనే లక్ష్యంగా చేసుకొని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన వరాలు ఫలితాన్నిచ్చాయి. తమ అనుకూల సమయానికి ఎన్నికలు నిర్వహించిన గులాబీ దళం నగరంపై పెత్తనాన్ని చాటుకున్నది. నిర్దేశించుకున్న లక్ష్యం వంద డివిజన్లను దాదాపుగా గెలుచు కున్నది... ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలు తమ బలాన్ని నిరూపించుకోలేకపోయాయి. ఆయా పార్టీల రాష్ట్ర, జాతీయ నేతలు ఎన్ని ఎత్తులు వేసినా చిత్తయ్యాయి. ఎంఐఎం మాత్రం తన బలాన్ని కాపాడుకున్నది. ఈ ఎపిసోడ్‌ మొత్తానికి పెద్దన్నగా వ్యవహరించిన కేటీఆర్‌ ఈ విజయాన్ని నాన్న కేసీఆర్‌కు ప్రేమతో సమర్పించుకున్నారు.

హైదరాబాద్‌లో గత రికార్డులను సునాయాసంగా అధిగమించిన టీఆర్‌ఎస్.. రాబోయే కాలంలో మరెవ్వరూ ఛేదించలేని.. కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేని కొత్త రికార్డును సృష్టించింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు అందకుండా సెంచరీ దరికి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకుగాను.. ఏకంగా 99 డివిజన్లలో విజయపతాకాన్ని రెపరెపలాడించింది! ఒకప్పటి వందల సుందర నందన వనాల పట్నం.. ఇప్పుడు గులాబీ నగరంగా పేరు మార్చుకుంది! టీఆర్‌ఎస్ అంటే.. తిరుగులేని రాజకీయ శక్తిగా రుజువు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కొత్త చరిత్ర లిఖించింది. హైదరాబాద్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా దాదాపుగా మూడింట రెండొంతుల కార్పొరేటర్ స్థానాలను గెలుచుకొని నగరంపై పూర్తి రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయంపై… పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీకి అనూహ్య విజయాన్ని అందించిన రాజధాని ఓటర్లకు థ్యాంక్స్ చెప్పారు. ప్రత్యర్థి పార్టీల నేతలు ఎన్ని విమర్శలు చేసినా.. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకానికి.. గ్రేటర్ ఫలితాలే నిదర్శనమన్నారు.. మంత్రి కేటీఆర్. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని.. కచ్చితంగా నిలబెట్టుకుంటామన్నారు. విపక్ష నేతల సవాళ్లను.. వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేందుకు… గ్రేటర్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ పనితీరుకు.. ఈ ఫలితాలు రెఫరెండమ్ లా భావిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా చేయడంలో.. ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారన్నారు.. మరో నేత మైనంపల్లి హనుమంతరావు. ప్రపంచంలో ఉత్తమ నగరంగా రాజధానిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్ ఫలితాలపై.. టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో పాటు.. కార్యకర్తలు సంబురాల్లో మునిగారు. జంట నగరాల్లో ధూంధాంగా వేడుకలు చేసుకుంటున్నారు.

అధికారమే లక్ష్యంగా ఉండే ఎంఐఎం నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో, నేడు టీఆర్‌ఎస్‌తో అనధికార పొత్తుతో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో పాతబస్తీలో మజ్లిస్‌కున్న పట్టు కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 43 సీట్లు సాధించగా, ప్రస్తుతం 44 సీట్లు సాధించింది. అయితే రిగ్గింగ్‌కు పాల్పడి, గెలిచారని ఇతర పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పాతబస్తీలోని ఎంబీటీ మజ్లిస్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. మొత్తం 150 డివిజన్లలో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్‌ఎస్‌కు 99, ఎంఐఎం 44, బీజేపీ 4, టీడీపీ 1, కాంగ్రెస్‌ 2 స్థానాల్లో గెలుపొందాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  GHMC  TRS  KTR  GHMC Elections  GHMC Results  

Other Articles