KAPU struggle or Revolt

Kapu struggle or revolt

kapu, Kapu Reservations, Mudragada Padmanabham, kapu Garjana, Chandrababu, Chandrababu on kapu Reservation, Mudragada Padmanabham Hunger Strike

Is it kapus struggle or revolt. kapus raising their voice for reservations. TDP gave assurance in elections for kapu reservations.

కాపు ఉద్యమమా..? తిరుగుబాటా..?

Posted: 02/05/2016 04:07 PM IST
Kapu struggle or revolt

ముద్రగడ పద్మనాభం మరోసారి కాపు ఉద్యమానికి తెర తీశారు. కిర్లంపూడితో తన బార్యతో కలిసి ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష ను ప్రారంభించారు. కాపు రిజర్వేషన్ల కోసం డూ ఆర్ డై అన్నట్లు ముద్రగడ వ్యవహరిస్తున్నారు.తనను అరెస్టు చేసినా కానీ తన నిరాహార దీక్షను మాత్రం ఆపేదిలేదని వెల్లడించారు. టిడిపి ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పినట్లు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి. గ్లోబల్ కాపు కమ్యూనిటీ ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి  సంఘీబావం తెలిపారు. మూడు కోట్ల మంది కాపులు ఉన్నారు అందులో దాదాపు సగం మంది ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నారు

ఎంతో కాలంగా సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన కాపులు ఒక్కసారిగా ఐక్యంగా ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు. ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతును తెలుపుతూ కాపు రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు సిద్దంగా ఉన్నారు. కాపులకు ముందుగా రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి ఇప్పుడు వాటి కోసం కమీషన్ వేశాం.. కమీషన్ నివేదిక వచ్చిన తర్వాత రిజర్వేషన్ల అంశం చర్చిస్తామని అనడం కాపులకు కోపం తెప్పిస్తోంది. గతంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల విద్య, ఉపాధి అవకాశాలు లభించాయి. కానీ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల కాపుల రిజర్వేషన్లను ఎత్తివేశారు. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో మరోసారి కాపులు  తమ రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని ప్రారంభించారు.

Also Read: ముద్రగడ నిరాహార దీక్ష.. చర్చలు విఫలం

*చంద్రబాబు మోసాలు  
కాపు లు 1934 లో ఫోర్త్ సెట్ చర్చ్ అసెట్ లో sc గా ఉండేవాళ్ళు తరువాత 1956 వరకు బిసిలుగా ఉండేవాళ్ళు 1961 లో బిసిలు మళ్లీ 1966 లో బిసి రిజర్వేషన్ తీసేశారు.
బీడియా ముందు గంభీరాలకు పోయే చంద్రబాబు నాయుడు జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని....
 * 35 సమతరాలు అనుభవం ఉన్న చంద్రబాబు కాపులు పేదరికం లో ఉన్నారు అని గుర్తించిన మీరు 2 సంవత్సరాలు ఎందుకు కాపుల కోసం ఆలోచించలేదు ? వచ్చిన 6 నెలలో ఎందుకు సమస్యను కాపు లను బిసిలలో చేర్చలేదు..?
 * బిసిలకు నష్టం కలగకుండా చేస్తాను అన్నచంద్రబాబు మీడియా ముందు మాత్రం కాపులను బీసీల్లో చేర్చితే వాళ్లు కూడా ఉద్యమిస్తారు అని ఎందుకు అన్నారు..?
 * తుని ఘనటతో సామన్య ప్రజల దృష్టిలో కాపులను రౌడీ లను ఎందుకు చేశారు. ..? నిజానికి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత కానీ చంద్రబాబు తప్పును కప్పి... కాపుల మీద మొత్తం నేరాన్ని నెట్టడం ఎంత వరకు న్యాయం..?

Also Read: టెన్షన్ టెన్షన్.. కిర్లంపూడిలో టెన్షన్

ముస్లింలకు రిజర్వేషన్లు కావాలని అప్పట్లో మహ్మద్ జానీ లేఖ రాస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి... తక్షణమే స్పందించారని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలపై మూడు నెలల్లో రిపోర్టు తెప్పించుకుని రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గడువు పెట్టుకుని కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి కదా అని ముద్రగడ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాపులపై ప్రేమ కురిపించిన చంద్రబాబు... ఇప్పుడు ఏం చేశారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కాపు గర్జన నిర్వహించామన్నారు. కాపుల అభివృద్ధికి 2వేల కోట్లు ఇవ్వాలని, అయితే ఈ ప్రభుత్వం భిక్ష వేసినట్లు కేవలం యాభై కోట్లు, వందకోట్లు ఇచ్చి తమ జాతిని అవమానిస్తోందని ముద్రగడ ధ్వజమెత్తారు. కాగా వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను వర్తింపచేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిజర్వేషను అమలు చేయడంలో వైఎస్ విజయం సాధించారు. ఈ రిజర్వేషన్లతోనే మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులకు కూడా ఉన్నతవిద్యను చదువుకునే వీలు కలిగింది.

Also Read: కాపులకు నా మద్దతు: జగన్

కాపులను బీసీల్లోకి చేర్చాలని డిమాండ్‌తో 1994లో ముద్రగడ సతీసమేతంగా కిర్లంపూడిలోని తన స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కోట్ల విజయభాస్కరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రావులపాలెంలో జరిగిన ముఖ్యమంత్రి సభలో నల్ల బ్యాడ్జీలు ధరించిన కాపులపై లాఠీచార్జి జరిగింది. దీంతో ఆయన ఉద్యమంలోకి దిగారు. తొలుత ఈ ఉద్యమంలో భాగంగా రైలురోకో, రాస్తారోకో, ఐదువేల మందితో కిర్లంపూడి నుంచి తిరుపతికి సైకిళ్ల ర్యాలీ ప్రారంభించినా ప్రభుత్వం స్పందించలేదు. ముద్రగడ వెంట వెళ్లిన సైకిళ్ల ర్యాలీ పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వద్దకు చేరుకోగానే విధ్వంసకాండ చోటుచేసుకుంది. ర్యాలీ వెనుకకు పంపించి ముద్రగడ తిరుపతి వెళ్లి వచ్చిన అనంతరం కిర్లంపూడిలో సతీసమేతంగా ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి దిగారు. ఈ ఉద్యమంతో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి జీవో నెం.30 విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kapu  Kapu Reservations  Mudragada Padmanabham  kapu Garjana  Chandrababu  

Other Articles