Congress party and some parties demand to implement section 8 in hyderabad

Congress party and some parties demand to implement section 8 in hyderabad

Old city, MIM, AIMIM, Congress, Section 8, Hyderabad, Congress, Owisi

Congress party and some parties demand to implement section 8 in hyderabad. On Old city incident all parties demand to implement section 8

హైదరాబాద్ లో సెక్షన్ 8....?

Posted: 02/04/2016 09:42 AM IST
Congress party and some parties demand to implement section 8 in hyderabad

మరోసారి సక్షన్ 8 అంశం వార్తల్లోకి వచ్చింది. విభజన చట్టంలోని సెక్షన్ 8 కింద ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను కాపాడే బాధ్యత గవర్నర్ కు అప్పగించాలని మరోసారి డిమాండ్ వినిపిస్తోంది. ఎంఐఎం దాడులతో హైద్రాబాదులో సెక్షన్ 8 అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఓల్డ్ సిటీలో జరిగిన ఘటనలపై అఖిలపక్ష నేతలు ముక్తకంఠంతో ఖండించారు. హైద్రాబాదులో ఎంఐఎం-టీఆర్ఎస్ అరాచకాలు సృష్టిస్తోందని గవర్నర్, ఈసీకి ఫిర్యాదు చేశారు. సెక్షన్ 8అమలు చేసి రాజ్యాంగ పరిరక్షణ చేయాలని కోరారు.

గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల రోజు ఎంఐఎం పార్టీ అరాచకాలపై అఖిలపక్ష నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ కు టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతలు హాజరయ్యారు. సీపీఐ, సీపీఎం నేతలు అందుబాటులో లేకపోయినా..ఫోన్లో మద్దతు ప్రకటించారు. పాతబస్తీలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, షబ్బీర్ అలీతోపాటు బీజేపీ కార్పొరేటర్లు, ఎంబీటీ నేతలపై ఎంఐఎం దాడులను ఆల్ పార్టీ నేతలు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వం అండతోనే ఎంఐఎం అరాచకాలకు పాల్పడుతోందని ఫైరయ్యారు.

టీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలు లోపించాయని అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్ కు మొరపెట్టుకున్నారు. ఎంఐఎం చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. పాతబస్తీలో దాడులు జరిగి 24గంటలు దాటినా ఏ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. పాతబస్తీలో ఎంఐఎం అరాచకాలు..కొత్తబస్తీలో టీఆర్ఎస్ ఆగడాలు తారాస్థాయికి చేరాయని ఫిర్యాదు చేశారు.  తక్షణమే జోక్యం చేసుకుని విభజన చట్టంలో పొందుపర్చిన హక్కులను అమలు చేసి..హైద్రాబాదులో సెక్షన్ 8అమలు చేయాలని డిమాండ్ చేశారు.  రాజ్యాంగ పరిరక్షణ చేయాలని గవర్నర్ ను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Old city  MIM  AIMIM  Congress  Section 8  Hyderabad  Congress  Owisi  

Other Articles