Repolling in puranapool

Repolling in puranapool

Repolling, Puranapool, Elections, GHMC, GHMC Polls, Old city, MIM, Congress

Election commission decided to conduct repolling in puranapool division. In puranapool division MIM leaders attacked on congress leader.

రేపు పురానాపూల్ లో రీపోలింగ్

Posted: 02/04/2016 09:02 AM IST
Repolling in puranapool

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పురానాపూల్ లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో రీపోలింగ్ అనివార్యమైంది. ఎంఐఎం కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య జరిగిన దాడితో వివాదం మొదలుకాగా... ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ కార్ల మీద దాడి... అసదుద్దీన్ చేయి చేసుకోవడం లాంటి అవాంఛనీయ ఘటనలు జరిగాయి. దాంతో ఈ పోలింగ్ కేంద్రాల్లో తిరిగి పోలింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమీషన్ ను కోరారు. అయితే పురానా పూల్ డివిజన్ లో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ నిర్ణయించింది.

పురానాపూల్ డివిజన్ వ్యాప్తంగా రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు 3వ తేదీ రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం రేపు డివిజన్ లోని మొత్తం 36 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. 36 పోలింగ్ బూత్లలో రేపు ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 34,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 225 మంది ఎన్నికల సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారు. శుక్రవారం గ్రేటర్ పరిధిలో 24 ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. పూరానాపూల్ రీ పోలింగ్ కారణంగా 149 డివిజన్లకు ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Repolling  Puranapool  Elections  GHMC  GHMC Polls  Old city  MIM  Congress  

Other Articles