MIM party preseident Asaduddin Owisi anger on Congress leaders

Mim party preseident asaduddin owisi anger on congress leaders

MIM, Asaduddin, Owisi, Congress, Old City, Puranapool

MIM party President Asaduddin Owisi fire on Congress leaders. In Puranapool, MIM leaders attacked on congress leaders infront of Asadiddin

ITEMVIDEOS: రెచ్చిపోయిన అసదుద్దీన్ ఓవైసీ.. పాతబస్తీలో టెన్షన్

Posted: 02/02/2016 06:47 PM IST
Mim party preseident asaduddin owisi anger on congress leaders

ఎంఎం పార్టీ అధ్యక్షుడు. పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ రెచ్చిపోయారు. తమ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు జరిగిన వివాదంలో అసదుద్దీన్ కల్పించుకున్నారు. పాతబస్తీలోని పురానాపూల్ లో ఎంఐఎం రిగ్గింగ్ చేస్తోందని కాంగ్రెస్ వాగ్వాదానికి దిగారు. అయితే మహ్మద్ గౌస్ అనే ప్రస్తుత కాంగ్రెస్ కార్పోరేటర్ అభ్యర్థి, మాజీ ఎంఐఎం కార్పోరేటర్ ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రితో గొడవకు దిగారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఇద్దరినీ అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మహ్మద్ గౌస్ ను మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ కు తరలించగా.. కాంగ్రెస్ నేతలు అతడికి బెయిల్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

అయితే జరిగిన ఘటన గురించి తెలుసుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వెంటనే అక్కడికి చేరుకున్నారు. బెయిల్ ఇవ్వడానికి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి కొంత మంది కాంగ్రెస్ నాయకులను అతడు అడ్డుకున్నాడు. ఆవేశంతో ఊగిపోయిన అసదుద్దీన్ దుర్భాషలాడాడు. అయితే అసదుద్దీన్ ను కంట్రోల్ చెయ్యడానికి పోలీసులు ఎంతలా ప్రయత్నించినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు కాంగ్రెస్ నాయకుల మీద ఎంఐఎం కార్యకర్తలు దాడికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఓల్డ్ సిటీకి అదనపు బలగాలను రప్పించారు పోలీస్ ఉన్నతాధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MIM  Asaduddin  Owisi  Congress  Old City  Puranapool  

Other Articles