Central MInister venkiah naidu To break away from the post

Central minister venkiah naidu to break away from the post

Venkiah naidu, central Minister Venkiah Naidu, Venkiah, Modi, Venkaiah naidu News, Parliament, Urban development Minister, Parliamentary Affairs Minister Veniah Naidu

Central Urban development and Parliamentary affairs minister Venkaiah Naidu To break away from the post. His Rajasabha term will expire on June.

వెంకయ్య నాయుడుకు పదవీ గండం

Posted: 12/01/2015 03:25 PM IST
Central minister venkiah naidu to break away from the post

ఆయన మాట్లాడితే పార్లమెంట్ లో దుమ్మురేగాల్సిందే. ప్రతిపక్షాలు ఆయన మాటలకు మిన్నకుండా ఉండాల్సిందే. ఏ భాషలో అయినా అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న ఆ కేంద్ర మంత్రికి తాజాగా పదవీ గండం ఏర్పడింది. అయితే ప్రధాని కోపం వల్ల వచ్చిన గండం కాదు.. పార్లమెంట్ సభ్యత్వ గడువు ముగుస్తుండటంతో వస్తున్న గండం. ఎవరా మంత్రి అనుకుంటున్నారా...? కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు. అవును తాజాగా వెంకయ్య నాయుడుకు పదవి గండం ఏర్పడింది. జూన్ తో ముగియనున్న రాజ్యసభ సభ్యత్వంతో వెంకయ్య నాయుడు మంత్రి పదవి ఉంటుందా..? ఉండదా అన్న సందిగ్దం ఏర్పడింది.

Also Read: ఏ ఎండకా గోడుగు.. ఘనాపాటి వెంకయ్య 

ఇటీవలి కాలంలో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం అనేక కీలక నిర్ణయాలు చేసింది. అధికార పదవుల విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని పార్టీ అంతర్గత సమావేశంలో నిర్ణయించింది. అందులో భాగంగానే ఒక వ్యక్తికి మూడు విడతలకు మించి రాజ్యసభకు అవకాశం ఇవ్వరాదన్న 'సూత్రప్రాయ నిర్ణయం' కూడా జరిగినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ తరఫున ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తూ మోదీ మంత్రిమండలిలో కొనసాగుతున్న వారిలో అరుణ్‌జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, వెంకయ్యనాయుడు వంటి నేతల విషయం చర్చనీయాంశంగా మారింది. వీరిలో రవిశంకర్ ప్రసాద్, అరుణ్ జైట్లీల రాజ్యసభ పదవీ కాలం 2018లో ముగుస్తుంది. కానీ వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవీ కాలం వచ్చే జూన్ నెలతో ముగుస్తుంది. బీజేపీ తాజా 'సూత్రప్రాయ నిర్ణయం'తో వెంకయ్యనాయుడు పదవి ప్రశ్నార్థకంగా మారింది. ఆయన సేవలను ఏ రకంగా ఉపయోగించుకోవాలన్న అంశం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఒకవేళ మరోసారి రాజ్యసభ సభ్యత్వం దక్కకపోతే మాత్రం వెంకయ్య నాయుడు ప్రస్తుతం అనుభవిస్తున్న కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles