Communion wafer bleeding turns miracle

Communion wafer bleeding turns miracle

Communion wafer, jesus, the Catholic communion, Salt Lake City, Jesus Christ body, Jesus blood, sacramental bread

A few of the followers claim the sacramental bread 'bled' for 3 days following communion at St. Francis Xavier Church in Kearns, Salt Lake City, after it was placed in a glass of water. Now this strange news was being investigated by the Catholic Diocese of Salt Lake City. A wafer, which is even referred as ‘host’ or ‘sacramental bread’, is believed to represent the Jesus Christ body, in the Catholic communion ceremony. It is consumed with wine which is believed to represent Jesus blood.

ITEMVIDEOS: అలా జరగడం యేసు క్రీస్తు మహిమ...!?

Posted: 11/30/2015 07:54 PM IST
Communion wafer bleeding turns miracle

దేవుడు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలడు.. రాయిలోంచి నీరు తెప్పించగలడు.. అదే రాళ్లతో మాట్లాడించగలడు. అయితే తాజాగా ఓ చర్చిలో జరిగిన అద్భతం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేవుడు ఉన్నాడు అని మరోసారి నిరూపిచడానికే అలా చేస్తున్నాడని అక్కడి వారు గట్టిగా నమ్ముతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సాల్ట్ లేక్ సిటీలోని సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిలో నీటిలో ఉంచిన బ్రెడ్ ఎర్రగా.. రక్తం లాగా మారిపోయింది. యేసు క్రీస్తు ప్రార్థనలో భాగంగా వైన్ ను, బ్రెడ్ ను ఆఫర్ చేస్తారు. వైన్ అంటే దేవుడి రక్తం అని, బ్రెడ్ అంటే దేవుడి శరీరం అని నమ్ముతారు. కాగా దేవుడి శరీరంగా బావించే బ్రెడ్ ఇలా రక్తం రంగు రావడంతో ఆ క్యాథలిక్ చర్చ్ కు జనాలు పోటెత్తారు. క్షణాల్లో ఆ వార్త నగరం అంతా ప్రచారం జరిగింది.

మామూలుగా అయితే ప్రార్థనల్లో బాగంగా వైన్ ను, బ్రెడ్ ను ఆపర్ చేస్తుండగా.. దేవుడికి నివేదించిన బ్రెడ్ ఇలా రంగు మారడం మీద అక్కడ వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే అలా మారడానికి గల కారణాల మీద పూర్తి స్థాయి వివరాలు తెలుసుకునేందుకు చర్చి కమిటిని ఏర్పాటు చేసింది. కాగా ఇది కేవలం ఆ యేసు ప్రభువు మహిమే అంటూ చాలా మంది నమ్ముతున్నారు. దేవుడు తన ఉనికిని చాటుకోవడానికే ఇలా చేస్తున్నారని వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles