Farmer Climbs Chandrababu Naidu Cutout Due To Financial Problems

Farmer climbs chandrababu naidu cutout due to financial problems

Chandraababu Naidu, Viajayawada, AP, Govindarajulu, Chandrababu Naidu cutout

A farmer climbs ap cm Chandrababu Naidus cutout at Vijayawada for suicide. Finally police brought him down.

చంద్రబాబు కటౌట్ వద్ద ఆత్మహత్యాయత్నం

Posted: 11/30/2015 03:48 PM IST
Farmer climbs chandrababu naidu cutout due to financial problems


విజయవాడలోని సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్యాంపు ఆఫీస్ ముందు ఏర్పాటు చేసిన 100 అడుగుల చంద్రబాబు కటౌట్ పైకి ఎక్కిన ఓ రైతు..అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో పాటు కేన్సర్ వ్యాధి, ఆర్థిక సమస్యలే తన ఆత్మహత్యాయత్నానికి కారణమని సూసైడ్ నోట్ లో రాసాడు. ఆ రైతుని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం అడ్డెకల్లుకు చెందిన గోవిందరాజులుగా గుర్తించారు. ఓ వైపు ఏపీ కేబినెట్ సమావేశం హాట్ హాట్ గా నడుస్తుంటే..ఇటు రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.

2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన గోవిందరాజులు.. వార్డ్ మెంబర్ గా గెలిచాడు. కాగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో ఆర్థికంగా చితికిపోయాడు. దీనికి తోడు కేన్సర్ వ్యాధి బాధిస్తోంది. 3లక్షలు ఖర్చు చేసినా వ్యాధి నయం కాలేదు. అటు వ్యవసాయంలోనూ నష్టాలే వచ్చాయి. తన ఆర్థిక సమస్యలను టీడీపీ నేతలకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని, అందుకే ఈ పని చేశానని గోవిందరాజులు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు గోవిందరాజులుతో మాట్లాడారు. అతడికి నచ్చచెప్పి కిందకు దింపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandraababu Naidu  Viajayawada  AP  Govindarajulu  Chandrababu Naidu cutout  

Other Articles