Chintu royal surenderd himself in chottoor court

Chintu royal surenderd himself in chottoor court

Mayor, Mayor Anuaradha, Mohan, Chitu, Chitu Royal, Chittoor Mayor, Chittoor Mayor Muder, Mayor Murder, AP, AP Police, Chittoor court

Chittoor Mayor Katari Anuradha and her husband Mohan murder case accused chitu royal surenderd himself in Chottoor court.

చిత్తూరు కోర్ట్ లో లొంగిపోయిన చింటు

Posted: 11/30/2015 12:42 PM IST
Chintu royal surenderd himself in chottoor court

ఏపిలో తీవ్ర సంచలనం రేపిన కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసులో నిందితుడిగా బావిస్తున్న చింటు నాటకీయంగా చిత్తూరు కోర్ట్ లో లొంగిపోయారు. చిత్తూరు మేయర్ దంపతులను మేయర్ కార్యాలయం వద్దే గుర్తుల తెలియని అంతకులు హత్య చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. కాగా హత్య చేయించింది.. చింటు రాయల్ అని అనుమానించిన పోలీసులు అతడి కోసం వెతికారు. మేయర్ హత్య తర్వాత కనిపించకుండా పోయిన చింటు మీద మరిన్ని అనుమానాలకు ఆస్కారం లభించింది. అయితే మేయర్ తో డబ్బుల విషయంలో వచ్చిన కొన్ని మనస్పర్దల వల్ల మర్డర్ కు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా తిరిగిన చింటే చిత్తూరు కోర్టులో ఎలా లొంగిపోయాడు అన్న దాని మీద చర్చ సాగుతోంది.

మేయర్ హత్య మీద ఏపి ప్రభుత్వం సీరియస్ గా విచారణ చేయిస్తోంది. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మేయర్ హత్య కేసు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. మేయర్ కుటుంబానికి దగ్గరి బంధువే అయిన చింటు రాయల్ వారి హత్యకు కారణమని పోలీసులు అనుమానించారు. కాగా ఈ హత్యతో ముడిపడిన ముగ్గురు నిందితులు మురగ, పరంధామ, హరిదాసులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలోనే చింటు చిత్తూరు కోర్టులో లొంగిపోయారు. తనకు, ఆ హత్యకు ఎలాంటి సంబందం లేదని చింటు గతంలో లేఖ రాశాడు. మరి ఎలాంటి సంబందం లేకపోతే మేయర్ హత్య తర్వాత ఎందుకు పారిపోయాడు..? ఎక్కడికి పారిపోయాడు..? ఇలాంటి ప్రశ్నలకు పోలీసులే త్వరలోనే క్లారిటీ ఇస్తారు. మొత్తానికి పోలీసులు వెతుకుతున్న చింటు రాయల్ తనంతట తానే స్వయంగా కోర్ట్ లో లొంగిపోవడంతో ఈ కేసు ఓ కొలిక్కివచ్చినట్లు కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles