Police arrest Fake doctors in Old city

Police arrest fake doctors in old city

fake, doctors, hyderabad, old city, Hyderabad police, Fake doctors, Duplicate doctors

Hyderabad police arrested fake doctors in old city. Police filed cases under section 420, 336. Police interagating the fake doctors.

ఉత్తుత్తి డాక్టర్.. ఉత్తుత్తి డాక్టర్ @పాతబస్తీ

Posted: 11/30/2015 09:55 AM IST
Police arrest fake doctors in old city

నమ్మించడానికి మంచి కారణం ఉంటే చాలు ఈజీగా బతికేయవచ్చు. నకిలీ మసాలాలు, నకిలీ క్రీములు ఇలా అన్నింటా నకిలీలు వస్తున్నాయి.. వాటి  మీద వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా నకిలీ డాక్టర్లు కూడా రంగంలోకి దిగారు. నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకొని.. ఎనిమిది మందుల బిల్లల పేర్లు గుర్తుంచుకుంటే చాలు డాక్టర్ అవతారం ఎత్తవచ్చు... ఎంతైనా సంపాదించవచ్చు. అయితే ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరుగుతోందని అనుకుంటున్నారేమో అస్సలు కాదు. హైదరాబాద్ లో అందులోనూ పాతబస్తీలో వెలుగు చూసిన తతంగం. అక్కడ పోలీసులు నకిలీ డాక్టర్ల వివరాలు తెలుసుకొని షాక్ అవుతున్నారు. నకిలీ డాక్టర్ల వ్యవహారం ఏంటో మీరూ చూడండి.

పాతబస్తీలొ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 107 మందిని అదుపులొ తీసుకున్నారు. కాగా వీరిలో చాలా మంది నిబంధనలకు విరుద్దంగా ఆస్పత్రులను నడుపుతున్న వారే. ఇటీవల వైద్యం పేరిట రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్న ఘటనలు చాలా వెలుగులో్కి వచ్చాయి. ఓ ఆర్ఎంపీ డాక్టర్ కనీసం ఏంటో కూడా తెలియకుండానే. సర్జరీ చేసి ఓ నిండు గర్భిణి ప్రాణాలను బలితీసుకున్నాడు. ఇలా పాతబస్తీ చుట్టుపక్కలి ప్రాంతాల్లో చాలా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నకిలీ డాక్టర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యాభై మందిపై సెక్షన్ 420, 336 కింద కేసులు కూడా నమోదు చేశారు.

డాక్టర్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fake  doctors  hyderabad  old city  Hyderabad police  Fake doctors  Duplicate doctors  

Other Articles