yoga guru | baba ramdev | black money | modi government | tax evaders | scams

Baba ramdev s big attack on modi government on black money

baba ramdev, BJP, black money, press conference, yoga guru, baba ramdev, black money, modi government, tax evaders, PM modi, union minister, nitin gadkari, andaman nicobar islands, yoga tourist spot, bidding

Normally pro-Modi, Baba Ramdev has made a shocking attack on Modi government, saying black money has increased under the BJP dispensation.

ITEMVIDEOS: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై బాబా రాందేవ్ విమర్శలు..

Posted: 11/29/2015 10:21 AM IST
Baba ramdev s big attack on modi government on black money

ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై యోగా గురువు బాబా రాందేవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ పభుత్వానికి నిత్యం అనుకూలంగా వుండే యోగా గురు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత దేశంలో నల్లధనం పెరిగిపోయిందని ఆరోపించారు. నల్లధనం రెండు రకాలుగా వుందని, ఒకటి కుంబకోణాలు చేసి సంపాదించగా, మరోకటి పన్ను ఎగవేసిన సొమ్మును నల్లధనంగా మారుస్తున్నారన్నారు. అయితే నల్లధనాన్ని నియంత్రించడంలో మోడీ సర్కార్ విఫలమవుతుందని అయన అభిప్రాయపడ్డారు.

వంద రోజుల్లో విధేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తామని చెప్పిన మోదీ సర్కార్. వాటిని దేశ ప్రజలందరకీ రూ.15 లక్షల చోప్పున పంచుతామని సార్వత్రిక ఎన్నికలకు ముందు చెప్పిన హామిని ఏప్పుడు నెరవేర్చనున్నారన్న ప్రశ్నకు ఆయన దాటవేత ధోరణి అవలంభిస్తూనే.. మోడీ ప్రభుత్వంపై తనకు విశ్వాసముందని నర్మగర్భవ్యాఖ్యాలు చేశారు. నల్లధన కుబేరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన అవకాశం నేపథ్యంలో సుమారు 636 మంది నల్లధన కుబేరులు నుంచి పన్నులు, జరిమానాల రూపంలో రూ. 2262 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వానికి చేరాయి.

కాగా వీటిని పంచినా.. అది దేశ ప్రజలకు 18 రూపాయల చోప్పునే అందుతుందని, మరి 15 లక్షల రూపాయలను ఎలా పంపిణీ చేస్తారన్న ప్రశ్నమై ఆయన నీళ్లు నమిలారు. అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వం ఎన్నికలలో చేసిన హామీలపై ప్రభుత్వాన్నే ప్రశ్నించాలని ఆయన అన్నారు. నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలను వంద రోజుల్లో తగ్గించి.. వాటి ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు పరిశీలనలు జరిపి చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ హామీపై కూడా బాబా రాందేవ్ మిన్నకుండిపోయారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baba ramdev  BJP  black money  press conference  

Other Articles