Fresh trouble for Nestle: UP lab finds Maggi Pazzta sample with excess lead

After maggi noodles up lab finds nestle s pasta unsafe

Fresh trouble for Nestle, another trouble for nestle, excess lead in maggi pasta, MSG in maggi pasta, UP lab finds MSG Maggi Pasta, maggi, maggi pazzta, maggi back, is maggi safe, maggi news, lucknow news, maggi new tests, new tests maggi

Nestle claims it never got any notice from Lucknow lab, says its product ‘100% safe’

మ్యాగీకి మరో దెబ్బ.. ఆ వార్తలను ఖండించిన నెస్లీ

Posted: 11/28/2015 06:15 PM IST
After maggi noodles up lab finds nestle s pasta unsafe

మ్యాగీ పై మరో దెబ్బ పడింది. ఈ సారి కూడా ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఇది ప్రారంభమైంది. మ్యాగీ నూడుల్స్ లో ప్రమాదకర రసాయనాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో తొలి దెబ్బ తాకిన నెస్లీ సంస్థకు పాస్తా రూపంలో మరో షాక్ తగిలింది. మ్యాగీ నూడుల్స్ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రమాదకర స్థాయిలో రసాయనాలున్నాయని ల్యాబోరేటరీ పరీక్షలు కూడా తేల్చడంతో దేశవ్యాప్తంగా మ్యాగీ విక్రయాలు నిలిచిపోయాయి. అప్పటిదాకా లాభాల్లో ఉన్న నెస్లే, ఈ చర్యతో నష్టాల బాట పట్టక తప్పలేదు. మలి దఫా పరీక్షల్లో పాసైన మ్యాగీ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది.

ఈ విపరిణామాల నుంచి నెమ్మదిగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నెస్లేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ ఉత్పత్తి చేస్తున్న పాస్తాలో సీసం పరిమాణం నిర్ణీత ప్రమాణం కంటే అధిక స్థాయిలో ఉందని ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబోరేటరీ పరీక్షల్లో తేలింది. సాధారణంగా పాస్తాలో 2.5 పీపీఎం దాకా సీసం ఉండొచ్చు. అయితే నెస్లే పాస్తాలో సీసం పరిమాణం 6 పీపీఎంగా ఉందట. యూపీ లాబోరేటరీ నివేదక ప్రకారం నెస్లే పాస్తా ప్రమాదకర ఆహార పదార్థాల జాబితాలో చేరిపోయింది. మరోమారు దీనిపై పరీక్షలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ విషయంపై నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే మ్యాగీ పాస్తాలో హానికారక సీసం శాతం ఎక్కువగా ఉందని వెల్లువెత్తుతున్న వార్తలను నెస్లే సంస్థ ఖండించింది. నాణ్యమైన ముడి సరుకును ఉపయోగించి పాస్తాను తయారు చేస్తున్నామని, నాణ్యత విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోను రాజీ పడమని, తినడానికి మ్యాగీ పాస్తా అత్యంత సురక్షితమైనదని తెలిపింది. పాస్తాలో సీసం ఎక్కువగా ఉందంటూ మీడియాలో వస్తున్న వార్తలను తాము చూశామని, ఈ విషయంపై తాము కూడా దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించింది. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ ల్యాబ్ నుంచి తమకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు కూడా అందలేదని నెస్లీ సంస్థ తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nestle  MSG  excess lead  maggi pasta  UP lab  

Other Articles