relief for jeevitha rajasekhar in 2nd metropolitan court over cheque bounce case

Relief for jeevitha rajasekhar in cheque bounce case

cheque bounce Case, Jeevita Rajasekhar, erramanzil court, cheque bounce case, sama shekhar reddy, sama chandra shekar reddy, Evaraithe nakenti, loan for film, loan for movie

relief for jeevitha rajasekhar in cheque bounce case as 2nd metropolitan erramanzil court strike off the petition

ఆ కేసులో జీవితా రాజశేఖర్కు ఊరట

Posted: 11/28/2015 03:21 PM IST
Relief for jeevitha rajasekhar in cheque bounce case

సినీనటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్  చెక్ బౌన్స్ కేసులో ఎదుర్కోంటున్న విచారణకు న్యాయస్థానంలో ఊరట లభించింది. గత కొన్నేళ్లుగా న్యాయస్థానంలో విచారణను ఎదుర్కోంటున్న జీవితా రాజశేఖర్ కు  చెక్ బౌన్సు కేసు ఎర్రమంజిల్ కోర్టు ఊరటనిచ్చింది. శనివారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం పిటీషన్ దారుడి పెట్టిన పిటీషన్ ను కొట్టేసింది. ఈ సందర్భంగా జీవితా మాట్లాడుతూ న్యాయస్థానంలో ధర్మమే గెలిచిందన్నారు. తనను కోర్టుకు లాగిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని పేర్కోన్నారు, తమ పరువు ప్రతిష్టలను భంగం కలిగించాలని ఉద్దేశ్యపూర్వకంగానే తన దగ్గర నుంచి చెక్‌లు తీసుకుని, కావాలని కేసులో ఇరికించారని  ఆరోపించారు.

న్యాయస్థానం తమపై నమోదైన కేసును  కొట్టివేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా జీవితా రాజశేఖర్ 2007లో 'ఎవడైతే నాకేంటి' అనే సినిమా నిర్మించారు. ఇందుకోసం సామ శేఖర్రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. ఈ సందర్భంగా  అతడికి ఇచ్చిన చెక్‌ బౌన్స్ కావటంతో కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు 2014లో జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధించింది. అనంతరం ఆమె బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఎర్రమంజిల్ కోర్టు తీర్పుపై సామ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... జీవితా రాజశేఖర్పై  హైకోర్టులో అప్పీల్ చేస్తామన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cheque bounce Case  Jeevita Rajasekhar  erramanzil court  

Other Articles