government considers private schools appeal, postpones dsc and tet

Dsc notification may be in april or may

DSC, Telenagana, Kadiyam Srihari, 5 lakh DSC Aspirants, 5 lakh TET Aspirants, Private schools, Education department, TERT, state government, Education Department, BC Welfare Department

government takes private school appeal in consideration and postpones dsc and tet exams to april ending or may begining.

ఏప్రిల్, మేలలో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్.?

Posted: 11/28/2015 12:50 PM IST
Dsc notification may be in april or may

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పక్షం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటనతో ఆశగా ఎదురచూస్తున్న అర్హతగల అభ్యర్థులు మరోమారు నిరాశే ఎదురుకానుంది. అయితే పక్షం రోజుల్లో విడుదల కావాల్సిన నోటిఫికేషన్ ఏఫ్రిల్ మాసం చివర్లో లేదా మే నెల ఆరంబంలో విడుదలయ్యే అవకాశం వుందని సమాచారం. జూన్‌లో పరీక్ష నిర్వహించి జూలై నెలాఖరుకల్లా నియామకాలను పూర్తి చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. ఈలోగా అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

 ప్రస్తుతం పరీక్షల సమయం దగ్గరపడినందున ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లంతా పరీక్షకు సిద్ధమయ్యేందుకు సెలవులుపెట్టి వెళ్లిపోతారని...దీంతో విద్యా బోధన దెబ్బతింటుందన్న అంశంపైనా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పట్లో టెట్‌గానీ, డీఎస్సీ గానీ నిర్వహించవద్దని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సైతం విద్యాశాఖకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం వారి వినతిని పరిగణలోకి తీసుకుని విద్యాసంవత్సరం పూర్తైన తరువాత నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఉపాధ్యాయ ఖాళీల వివరాలు 3 రోజుల్లోగా ఇవ్వాలి : డిప్యూటీ సీఎం

డీఎస్సీ ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, డెరైక్టర్ కిషన్, విద్యాశాఖ, బీసీ సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ, బీసీ సంక్షేమశాఖ అధికారులతో  ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల పరిధిలోని పాఠశాలలు, గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, అప్‌గ్రేడ్ చేయాల్సిన పోస్టులు, అదనంగా సృష్టించాల్సిన పోస్టులు, ఆయా పాఠశాలలు, గురుకులాల్లో అవసరాలను పేర్కొంటూ పోస్టులకు సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన నివేదికలను మూడు రోజుల్లోగా అందించాలని ఆదేశించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DSC  TET  Telenagana  Kadiyam Srihari  Aspirants  

Other Articles