Police arrest gunman after deadly siege at Colorado Planned Parenthood

At least nine injured by gunman at colorado abortion clinic

Planned Parenthood, U.S., Colorado, shoutout, clinic, colarado springs, colarado, USA, SHOOTER;Picture available;Women,s Health;United States;Crime / Law / Justice;Crime;Government / Politics;Major News;General News;Colorado;Pictures;Video

Shooter seized after killing three people and wounding nine others at reproductive health clinic in Colorado Springs

అమెరికాలో సాయుధ ఉన్మాధి కలకలం.. అసుపత్రిలో కాల్పులు

Posted: 11/28/2015 12:48 PM IST
At least nine injured by gunman at colorado abortion clinic

అగ్రరాజ్యం మళ్లీ వణికిపోయింది. పారికష్ లో ఉగ్రవాదులు చోరబడి మారణకాండను సృష్టించిన బీభత్సఘటనను మరవకుముందే.. అమెరికాలో తుపాకి చప్పుళ్లు దద్దరిల్లింది. కొలరాడో రాష్ట్రం, కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలోకి ప్రవేశించిన సాయుధుడైన ఉన్మాది.. పలువురిపై కాల్పులు జరిపి, మరొకొందరిని బందీలుగా పట్టుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో దుండగుడికి, పోలీసులకు మధ్య కూడా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి సహా ముగ్గురు చనిపోగా, మరో 10 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు.

ఆసుపత్రి లోపల నక్కిఉన్న దుండగుడి వద్ద భారీ ఎత్తున గుర్తుతెలియని పదార్థాలు ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. బందీగా లోపలే ఉండిపోయిన ఓ మహిళ.. తన బంధువులకు ఫోన్ చేసి ఇద్దరు సాయుధులు ఉన్నట్లు చెప్పింది. అధికారుల ద్వారా కాల్పుల ఘటన వివరాలను తెలుసుకున్న  అధ్యక్షుడు బరాక్ ఒబామా.. పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆపరేషన్ నిర్వాహించాల్సిందిగా ఆదేశించారు. దాదాపు మూడు గంటల ఉత్కంఠ అనంతరం పోలీసులు.. దుండగుణ్ని పట్టుకోగలిగారు. గాయపడ్డ 11 మందికి ప్రాణాపాయం లేదని కొలరాడో స్ప్రింగ్స్ మేయర్ జాన్ షతెర్స్ చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shoutout  clinic  colarado springs  colarado  USA  

Other Articles