acb, cid officials face pressure in asi mohan reddy case

Asi mohan reddy remand extended

Money lender-ASI Mohan Reddy, ASI turns money lender, Gnaneshwar, ASI Mohan Reddy spreads finance business far and wide, Telangana, ASP janardhan reddy, DGP office, Hyderabad, transferred, crime, law and justice, exploiting, fleece people, Karimnagar district, CID officers, acb officials

The CID police who investigating asi mohan reddy case face hectic pressure in the case, says not to go deep into case

వడ్డాసురుడు మోహన్ రెడ్డి కేసు విచారణ ముందుకు సాగేనా..?

Posted: 11/28/2015 12:47 PM IST
Asi mohan reddy remand extended

పోలీసు ముసుగు అక్రమ వడ్డీల వ్యాపారాన్ని చేస్తూ. తన ఇష్టానుసారం వడ్డీల రేటు పెంచుతూ ప్రజల ఆస్తులను సొంతం చేసుకుని కోట్ల రూపాయలకు పడగలెత్తిన కరీంనగర్ ఎఎస్ఐ మోహన్ రెడ్డి కేసులో సీఐడీ అధికారులు ఒత్తిళ్లను ఎదుర్కోంటున్నారు. సిఐడీ అధికారులు ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసులో నమోదు చేస్తుండటంతో పలువురు ఇబ్బందుకులను ఎదుర్కోంటున్నారు. దీంతో తమకు తెలిసిన రాజకీయ ప్రముఖుల నుంచి సిఐడీ అధికారుపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్లు తెలిసింది.

మోహన్ రెడ్డి కేసు విచారణ మరింత లోతుగా వెళితే ఎక్కడ తమ పేర్లు బటయకుల వస్తాయోనని బడా వ్యాపారులు, ఎస్పీ స్థాయి అధికారులు.. రాజకీయ ప్రముఖుల నుండి ఒత్తిడి తీసుకువస్తున్నారు. తమ పేర్లు బయటకు రాకుండా కేసు విచారణను మరీ లోతుగా దర్యాప్తు చేయకుండా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితో  కేసును నీరుగార్చేలా సీఐడీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పెద్ద నేతతో మంతనాలు చేశారని వార్తులు వినబడుతున్నాయి,

అధికార పార్టీకి చెందిన కీలక నేత నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే సీఐడీ దూకుడుకు కళ్లెం పడుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకోసం భారీ మొత్తం చేతులు మారుతుందని కూడా అరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు మోహన్‌రెడ్డిపై ఫిర్యాదులు చేసిన బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఏసీబీకి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ప్రతి రోజు 5 నుంచి 7 ఫిర్యాదులు వస్తున్నాయని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.

కాగా మోహన్‌రెడ్డి పైనాన్స్ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న జ్ఞానేశ్వర్ సిఐడీ అధికారులకు ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. జ్ఞానేశ్వర్ చెప్పిన లెక్కలు.. అధికారులు లెక్కలకు అసులు పొంతన లేకుండా పోయింది. జ్ఞానేశ్వర్ చెప్పిన మాటలకు.. ఇక్కడి లెక్కలకు మధ్య తేడా ఉండడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సీఐడీ రిమాండ్ నివేదికలో పేర్కొన అంశాలు పరిశీలిస్తే జ్ఞానేశ్వర్ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు అంత కీలకం కాదని తెలుస్తోంది.

అయితే, జ్ఞానేశ్వర్ విలువైన పత్రాలను దాచిపెట్టినట్లు భావిస్తున్నారు. 15 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న అతను హైదరాబాద్, తిరుపతి ప్రాంతాల్లో సంచరించినట్లు అనుమానిస్తున్న పోలీసులు పత్రాలను ఆయా ప్రాంతాల్లోనే దాచి ఉంచాడని భావిస్తున్నారు. రాయలసీమలోని పలువురు ఫ్యాక్షన్ నేతలతో మోహన్‌రెడ్డికి సంబంధాలు ఉండటంతో జ్ఞానేశ్వర్ వ్యూహాత్మకంగా తిరుపతి వరకు వెళ్లి వారివద్దే ఈ డాక్యుమెంట్లు ఉంచారని ప్రచారం జరుగుతోంది. మరి సీఐడి అధికారులు గుట్టును రాబట్టి మోహన్ రెడ్డి కేసులో పురోగతి సాధిస్తారా..? లేక ఒత్తిళ్లకు లోనై కేసు దర్యాప్తును మధ్యంతరంగానే ముగిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan Reddy  Gnaneshwar  Police  CID officers  

Other Articles