PoK will remain with Pakistan

Pok will remain with pakistan

PoK, India, Pakistan, Dr Farooq Abdullah, Jammu and Kashmir, Line of Control

Fifteen years after he first suggested converting the Line of Control (LoC) into an International Border for lasting peace between India and Pakistan, former Chief Minister of Jammu and Kashmir and opposition National Conference (NC) patron Dr Farooq Abdullah raked up another controversy saying that then Prime Minister Atal Bihari Vajpayee during his Lahore visit had offered the division of Kashmir between the two neighbouring countries.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్థాన్దే

Posted: 11/28/2015 10:07 AM IST
Pok will remain with pakistan

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ పాకిస్తాన్‌తోనే ఉంటుందని జమ్మూ-కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిఓకె పాకిస్తాన్‌లో ఉంది, అది అలాగే కొనసాగుతుంది, జమ్మూ-కాశ్మీర్‌ భారత్‌లో ఉన్నాయి, ఇవి ఇలాగే ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలని అబ్దుల్లా అన్నారు. పిఓకె భారత్‌లో అంతర్భాగమని కొన్నేళ్లుగా నేనూ చెబుతూ వచ్చాను, కానీ..ఏం జరిగింది? భారత్‌లో అంతర్భాగంగా చేసుకోగలిగామా? అంటూ అబ్దుల్లా ప్రశ్నించారు. యుద్ధం పరిష్కారం చూపదు, ప్రాణాలు మాత్రం పోతాయి. చర్చలే అందుకు ఉన్న ఒకే ఒక్క అవకాశమని ఆయన అన్నారు.

ఫరూఖ్‌ అబ్దుల్లా వ్యాఖ్యలపై బిజెపి నేతలు మండిపడ్డారు. రాజ్యాగపరంగా పిఓకె భారత్‌లో అంతర్భాగమని 1994లో పార్లమెంట్‌ తీర్మానించినట్టు జమ్మూ-కాశ్మీర్‌ ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత నిర్మల్‌సింగ్‌ పేరొన్నారు. పిఓకెను పాక్‌ అక్రమంగా ఆక్రమించిందని, అబ్దుల్లా తప్పుడు ప్రకటన చేశారంటూ హోంశాఖ మాజీ కార్యదర్శి, బిజెపి ఎంపి ఆర్‌కె సింగ్‌ విమర్శించారు. బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ను అబ్దుల్లా సమర్థించారు. ఆయన దేశాన్ని వీడుతానన్నాడంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అబ్దుల్లా అన్నారు. ఏనాడూ ఆ మాట అనలేదని, ఈ మట్టిలో పుట్టాను, ఇక్కడే చనిపోతానని అమీర్‌ఖాన్‌ అన్నట్టు ఫరూఖ్‌ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PoK  India  Pakistan  Dr Farooq Abdullah  Jammu and Kashmir  Line of Control  

Other Articles