Modi breaks ice with Sonia and Manmohan on GST but chill persists

Modi breaks ice with sonia and manmohan on gst but chill persists

Modi, GST, GST Bill, Sonai Gandhi, Arun Jaitly, Manmohan SIngh, Tea party, Chai pe Charcha

Prime Minister Narendra Modi Friday met Congress president Sonia Gandhi and former prime minister Manmohan Singh, keeping hopes alive for the enactment of the Goods and Services Tax Bill before the beginning of the next financial year

జీఎస్టీ బిల్ మీద సానుకూల స్పందన

Posted: 11/28/2015 08:14 AM IST
Modi breaks ice with sonia and manmohan on gst but chill persists

వస్తుసేవల పన్ను బిల్లుకు(జీఎస్‌టీ) ప్రతిబంధకాలు తొలిగిపోతున్నాయనే ఆశలు చిగురించాయి. ప్రధాని నరేంద్ర మోడీ అదే అంశంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లతో ఇక్కడి తన అధికారిక నివాసం 7, రేస్‌కోర్సు రోడ్డులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిల్లుపై కాంగ్రెస్‌ నేతలు లేవనెత్తిన మూడు అభ్యంతరాలపై మోడీ స్పందించారు. ప్రభుత్వ స్పందనపై పార్టీలో చర్చిం చిన అనంతరం కాంగ్రెస్‌ నేతలకు ప్రభుత్వానికి మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయు డు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ హాజరయ్యారు.

సమావేశం ముగిసిన అనంతరం అరుణ్‌ జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ ''పార్లమెంట్‌ శీతాకాల సమా వేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే నిమిత్తం ప్రధాని మోడీ సోనియాజీ, మన్మోహన్‌జీలను ఆహ్వానిం చారు. జీఎస్‌టీ బిల్లుపైన కూడా చర్చ జరిగింది. కాంగ్రెస్‌ నేతలు మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావించా రు.వారు లేవనెత్తిన మూడు అభ్యంతరాల్లో రాజ్యాంగ బిల్లులో ప్రతిపాదిత 18 శాతం రేటును ప్రధానంగా ప్రస్తా వించాలని డిమాండ్‌, అంతర్‌ రాష్ట్ర సరకు రవాణాపై అదనంగా ఒక శాతం సుంకంవిధింపు పట్ల వ్యతిరేకత, ఐదేళ్ల కాలానికి ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు 100 శాతం పరిహారం లాంటివి ఉన్నాయి '' అని తెలిపారు. ''బిల్లు తాలూకు చరిత్ర, నేపథ్యం, వారు లేవనెత్తిన మూడు అంశాలపై ప్రభుత్వ స్పంద నను కూడా కాంగ్రెస్‌ నేతలకు పూసగు చ్చినట్టుగా వివరించాం'' అని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. ''దీనిపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు వారి సొంత పార్టీలో చర్చించుకుం టారు. ఆ తర్వాత కొంత కాలానికి ఈ అంశం పె మరింత చర్చించడానికి ప్రభుత్వం, కాంగ్రెస్‌ నేతలు మళ్లిd సమావేశ మవుతారు. వారు మాతో చర్చించిన విషయాలను మేమూ పరిగణనలోకి తీసుకుంటాం'' అని జైట్లీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  GST  GST Bill  Sonai Gandhi  Arun Jaitly  Manmohan SIngh  Tea party  Chai pe Charcha  

Other Articles