Police almost coform that Sarika did suicide

Telugu content

Rajaiah, Sirisilla Rajaiah, Rajaiah Daughter-in-Law, Sarika, Sarika Death, Sarika Suicide

Rajaiah Daughter in Law Sarika death case finall got conclusion. Forensic report reveals that Sarika death was not murder, it was a suicide.

రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యే

Posted: 11/27/2015 08:55 AM IST
Telugu content

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలి ఆత్మహత్య కేసులో నిజం వెలుగులోకి వచ్చింది. రాజయ్య కోడలు సారిక తన ముగ్గురు పిల్లలతో దహనమైన సంఘటన ఆత్మహత్యేనని ఫోరెన్సిక్‌ నిపుణులు తేల్చారు. నివేదికను గురువారం పోలీసులకు ఫోరెన్సిక్‌ నిపుణులు అందజేసినట్టు సమాచారం. ప్రాథమిక దర్యాప్తు మేరకు 306, 498, 147 సెక్షన్లపై కేసు నమోదు చేయడంతో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన కొడుకు అనిల్‌తో పాటు రాజయ్య భార్య మాధవికి వరంగల్‌ మెజిస్ట్రేట్‌ 15 రోజుల జ్యూడిషియల్‌ కస్టడీ విధించారు. రాజయ్య రెండుసార్లు బెయిల్‌ కోసం ప్రయత్నం చేయగా విఫలమైంది.

సారిక సజీవదహనం సంఘటనను క్లూస్‌ టీంతో పాటు ఫోరెన్సిక్‌ నిపుణుల ఆధ్వర్యంలో విచారణ చేశారు. మృతదేహాలు మాడిపోవడంతో ఫోరెన్సిక్‌ నిపుణులు పోస్ట్‌మార్టం సందర్భంగా పూర్తిస్థాయిలో పరిశీలించడంతో పాటు సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. అక్కడ పరిశీలించిన తర్వాత సారికది ఆత్మహత్యేనని తేల్చుతూ వరంగల్‌ పోలీసులకు నివేదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ ఉప ఎన్నికల బరిలోకి దిగాల్సిన రాజయ్య ఇలా కేసులో ఇరుక్కోవడంతో కాంగ్రెస్ పార్టీ సర్వే సత్యనారాయణను రంగంలోకి దిచడంతో పాటుగా రాజయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajaiah  Sirisilla Rajaiah  Rajaiah Daughter-in-Law  Sarika  Sarika Death  Sarika Suicide  

Other Articles