Corruption in chandababu Naidus govt

Corruption in chandababu naidus govt

jagan, chandrababu Naidu, ap, nellore, Jagan slams Chandrababu, floods, Corruption

Jagan Mohan Reddy salms Chandrababu naidu for corruption. He said that after chandrababu arrival in power, corruption level increased.

చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం: జగన్

Posted: 11/26/2015 04:09 PM IST
Corruption in chandababu naidus govt

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మీద ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ఏపిలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి అవినీతిమయమైందని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలను తీర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని జగన్ ఆరోపించారు. నెల్లూరులో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ అక్కడి ప్రజలకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ విమర్శించారు. నెల్లూరు పట్టణంలోని పేదల ఇళ్ల వద్దకు వస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ కూడా చంద్రబాబు నాయుడును విమర్శించకుండా తన పర్యటనను జగన్ పూర్తి చెయ్యలేడేమో అన్న విశ్లేషకుల మాట నిజమే అనిపిస్తోంది.

ఏపిలో వరద ప్రాంతాల్లో వచ్చిన నష్టాన్ని పూడ్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు మీద జగన్ విరుచుకుపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని.. పైగా అవినీతికి చంద్రబాబు ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్ గా మారిందని చేసిన విమర్శల మీద పార్టీ అభిమానులు మండిపడుతున్నారు. జగన్ లాంటి అవినీతి తిమింగళం చంద్రబాబు ప్రభుత్వం చేసే అవినీతి గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అని అనుకుంటున్నారు. వరద ప్రాంతాల్లో కూడా జగన్ రాజకీయాలు చెయ్యడం ఏంటని వారు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan  chandrababu Naidu  ap  nellore  Jagan slams Chandrababu  floods  Corruption  

Other Articles