Chinese man made army of Buddhas

Chinese man made army of buddhas

china, army of Budhas, Laughing budhas, Xinzheng City, Shi Jubin,jujube trees

A self-made Chinese businessman is aiming to have 10,000 Buddha statues carved using dead jujube trees. Over 9,200 handcrafted statues are now put on display in his company compound in Xinzheng City, east China, stretching as far as the eye can see, with some standing almost two metres tall, reports the People's Daily Online. Shi Jubin, a farmer-turned-tycoon, aims to make 10,000 of these laughing Buddhas.This rare exhibition spreads across 32,300 square feet and attracts thousands of visitors from across China each year. It's billed the world's largest group of Buddha statues, according to Chinese media.

ఆ గదినిండా లాఫింగ్ బుద్దా విగ్రహాలే..!

Posted: 11/26/2015 03:29 PM IST
Chinese man made army of buddhas

ప్రతి అంశలోనూ దేవుడే ఉంటాడు.. అది చూడలేని వాడే దేవుడు ఎక్కడ అని అడుగుతాడు. ఇది సత్యం. పురాణ కథల్లో కూడా ఇదే ఉంది. నీ స్వామి ఎక్కడ అని అడిగితే భక్త ప్రహ్లాదుడికి స్తంభంలోంచి నరసింహావతారంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలాగే ప్రతి అంశలో కూడా దేవుడిని ఊహించుకొని.. ఓ కారణంతో ముందుకు దూసుకెళ్లే వారికి దేవుడు ఎప్పుడూ వెంటే ఉంటారు. చైనాకు చెందిన ఓ వ్యాపారికి  చెందిన గదిలోకి వెళితే షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ గది నిండా.. లాఫింగ్ బుద్దాలే కనిపిస్తాయి.... అసలే లాఫింగ్ బుద్దా అంటే అందరికి అదృష్టం అని నమ్మకం.. మరి అలాంటి లాఫింగ్ బుద్దాలు ఒక గదినిండా కనిపిస్తే ఎలా ఉంటుంది..? చైనాలో చాలా మంది ఇలాంటి అనుభవం కోసమే అక్కడికి వెళుతున్నారు.

చైనాలోని క్సింగ్జెంగ్ సిటీలో షి జుబిన్ అనే ఓ బిజినెస్ మ్యాన్ అక్కడి జుజుబి చెట్ల నుండి వచ్చే ఉత్తత్తులను అమ్ముతుంటారు. చెట్లను నుండి వచ్చే పండ్లు, బెరడు, తేనె ఇలా అన్ని రకాల వస్తువులను అతడు అమ్ముతుంటాడు. అయితే అతడు ఈ జుజుబి చెట్లు చనిపోయిన తర్వాత వాటిని ఉపయోగించి.. విగ్రహాలు తయారు చెయ్యడం మొదలుపెట్టాడు. అయితే విగ్రహాలు అంటే మామూలువి కాదు.. లాఫింగ్ బుద్దా విగ్రహాలు. రకరకాలుగా నవ్వుతూ.. అదృష్టాన్ని తీసుకువస్తాడని నమ్మే లాఫింగ్ బుద్ద విగ్రహాలను తయారుచేస్తున్నాడు. అయితే తను ఓ పది వేల విగ్రహాలను ఇలా తయారు చేసి.. స్థానిక హాల్ లో ప్రదర్శించాలని అనుకున్నాడు. అందుకు 2000 సంవత్సరం నుండి విగ్రహాల తయారీని మొదలుపెట్టాడు. అయితే ప్రస్తుతానికి ఏకంగా 9200 విగ్రహాలు తయారయ్యాయి. అలా తయారుచేసిన విగ్రహాలన్నింటిని ఓ చోట భద్రపరిచారు. ఇలా తయారు చేసిన విగ్రహాలు అన్నింటిని ఒక్క చోట చూసిన వాళ్లకు ధ్రిల్లింగ్ గా ఉంది మరి. అందుకే ఎక్కడెక్కడి నుండో టూరిస్టులు వచ్చి ఈ విగ్రహాలను చూస్తున్నారు.

షి జుబిన్ ఎందుకు ఇంతలా విగ్రహాలను తయారు చెయ్యాలని అనిపించింది అని ప్ర్రశ్నిస్తే ఆయన చెప్పే సమాధానం ఏంటో తెలుసా..? జుజుబి చెట్లు చేస్తున్న మేలు ఎవ్వరు చెయ్యడం లేదని అంటారు. ఆ చెట్ల నుండి వచ్చే తేనె, పండ్లు, బెరడు, వేర్లు ఇలా ప్రతీదీ పనికి వస్తోంది. దాని మీద వ్యాపారం సాగుతోంది. మరి ఆ చెట్లు చచ్చిపోయిన తర్వాత వాటిని అలా వదిలెయ్యడం ఇష్టంలేక.. వాటిని ఎప్పటికి నిలిచేలా ఉంచాలని ఇలా విగ్రహాలను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  army of Budhas  Laughing budhas  Xinzheng City  Shi Jubin  jujube trees  

Other Articles