Google Doodle Honours Dr.Verghese Kurien

Google doodle honours dr verghese kurien

Milk, National Milk Day, White Revolution, Google, Doodle, India, Milk Man of India, Dr.Verghese Kurien, Dr.Verghese

Today is the 'Milkman of India' Verghese Kurien's 94th birth anniversary and Google has a doodle celebrating the day on its India home page. Kurien went on to lead the Gujarat Cooperative Milk Marketing Federation Ltd whose Amul is one of India's iconic brands.

ITEMVIDEOS: మిల్క్ మ్యాన్ ఆప్ ఇండియాకు ‘గూగుల్’ డూడుల్

Posted: 11/26/2015 01:37 PM IST
Google doodle honours dr verghese kurien

దేశంలో పాల విప్లవానికి నాంది పలికి.. ప్రస్తుతం పాలు విరివిగా లభించేలా చేసిన వర్ఘీస్ కురియన్ పుట్టిన రోజును గూగుల్ డూడుల్ సముచితంగా సత్కరించింది. గూగుల్ ఇండియాలో సెర్చింజన్ డూడుల్ ను వర్ఘీస్ కురియన్ తో అందంగా తయారు చేసింది. వర్గిస్ కురియన్ 94 వ పుట్టిన రోజు సందర్భంగా ఘనంగా అభినందించింది.. అలాగే ఘనంగా స్మరించుకుంది. అలాగే కురియన్ పుట్టిన రోజు నాడే భారతదేశం మొత్తం పాల దీనోత్సవం జరుపుకుటుంది. భారతదేశ శ్వేత (క్షీర) విప్లవ పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ వర్ఘీస్ కురియన్ 94వ జయంతిని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1921 నవంబరు 26న కేరళలో జన్మించిన కురియన్ భారతదేశ మిల్క్ మ్యాన్ గా ప్రసిద్ధిగాంచారు.

ఇంజనీరింగ్ (మెటలర్జీ) చదివిన డాక్టర్ వర్ఘీస్ కురియన్, ప్రపంచంలో అతిపెద్ద వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమమైన ఆపరేషన్ ఫ్లడ్ ను రూపొందించారు.   ఆపరేషన్ ఫ్లడ్, భారతదేశాన్ని తక్కువ పాల ఉత్పత్తిని కలిగిన దేశ స్థాయి నుండి ప్రపంచ అగ్రశ్రేణి పాల ఉత్పత్తిదారు దేశంగా మార్చివేసింది. డైరీ పరిశ్రమకి అర్థ శతాబ్దికి పైగా ప్రథమస్థానంలో నిలిచిన న్యూజిలాండును దాటి భారతదేశం పాల ఉత్పత్తిలో ప్రపంచాన అగ్రస్థానం పొందింది. ఈ పరిణామం ఓ నలభై ఏళ్ళ క్రితం ఎవరూ ఊహించి వుండరు.


కురియన్ గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) కు వ్యవస్థాపక చైర్మన్ గా యున్నపుడు Amul(అమూల్) బ్రాండ్ ఉత్పత్తిని సృష్టించి విజయం సాధించారు. బర్రె పాలతో అమూల్ పాలపొడి తయారీ ఆవిష్కరణ విజయంతో ఆయనకు ఆవు పాలతో పాలపొడి తయారీని అనేక పాలఉత్పత్తులు తయారుచేసే దేశాలు వ్యతిరేకించాయి. ఆయన తయారు చేసిన అమూల్ డైరీ విజయం 1965 లో భారత ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి చే ఆయనను "నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు" కు వ్యవస్థాపక చైర్మన్ గా ఎంపిక చేయబడినది. వర్ఘీస్ కురియన్ 2006 నుండి 2011 వరకు అలహాబాదు విశ్వవిద్యాలయానికి మొదటి ఛన్సలర్ గా సేవలందించారు.


వర్ఘీస్ కురియన్ రైతుల నిర్వహణలో అముల్, జిసిఎంఎంఎఫ్, ఐఆర్ఎంఏ, ఎన్.డి.డి.బి వంటి 30 సంస్థలను స్థాపించారు. ఆయన 1963లో ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసేసే అవార్డును అందుకున్నారు, ఆయన 1989లో అమెరికాలోని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అందించే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను గెల్చుకున్నారు. ఆయన 1965లో భారతదేశ ప్రభుత్వం అందించే పద్మశ్రీ, 1966లో పద్మభూషణ్ మరియు 1999లో పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles