Who will stand against the Telanagna cm KCR

Who will stand against the telanagna cm kcr

KCR, Telangana, CM KCR, Chandrababu Naidu, Competition, Jagan, Jana Reddy, Congress, Telangana King, King maker in Telangana, KCR as King, KCR Vs Chandrababu Naidu

KCR getting more and more strength in Telangana state. There is no replacement for KCR. Chanadrababu Naidu, Jagan and JanaReddy can not give strong Competition.

కేసీఆర్ కు ఎదురు నిలిచే మగాడు ఎవ్వడు...?

Posted: 11/26/2015 12:56 PM IST
Who will stand against the telanagna cm kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూసుకెళుతున్నారు. వరంగల్ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయకేతనం ఎగరవేసిన గులాబీదళపతికి తెలంగాణలో ఎదురులేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అదే విషయాన్ని నొక్కి వక్కానిస్తాయి. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మొదలు అన్ని అంశాల్లో కూడా కేసీఆర్ కు అనుకూలంగానే పరిస్థితులు మారిపోయాయి. ప్రతిపక్షాల్లో ఒక్క పార్టీకి కూడా పట్టులేకపోవడం.. వారు చేసే విమర్శల్లో పస లేకపోవడం ఇలా చాలా రకాల కారణాల వల్ల తెలంగాణ సిఎం కేసీఆర్ తెలంగాణ బాద్షాగా కొనసాగుతున్నారు. మరి భవిష్యత్ లో కేసీఆర్ కు ఎదురులేదా..? అయినా తెలంగాణలో కేసీఆర్ ను ఎదురించే, ఎదురు నిలిచే మగాడు ఎవ్వడు అన్నది అందరికి వస్తున్న సందేహం.

కేసీఆర్ కు ఎదురు నిలిచే సత్తా ఎవరికి ఉందా అన్న దానికి సమర్థవంతమైన నాయకులు ఎవరు అని చిట్టా తీయాల్సి వస్తుంది. అలా చిట్టా తీస్తే ముందుగా వినిపించే పేరు నారా చంద్రబాబు నాయుడు. అవును. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు ధీటుగా ఎదుర్కోగల వ్యక్తి అని చాలా మంది బావిస్తుంటారు. కానీ పరిస్థితి అలా లేదు. ఎందుకంటే.. తెలంగాణలో చంద్రబాబు పార్టీకి సరైన క్యాడర్ లేదు. అలాగే ఏపిని వదిలి తెలంగాణకు చంద్రబాబు రాలేడు.. ఆ విషయం అందరికి తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడును పోటీలోనే పెట్టాల్సిన అవసరం అయితే లేదు.

ఇక రాజశేఖర్ రెడ్డి కొడుకుగా, వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జగన్ అయినా కనీసం కేసీఆర్ కు తగిన మొగుడు అని అనుకుందామా అంటే అదీ లేదు. ఎందుకంటే ఏపిలోనే జగన్ కు సరైన ప్రజా బలం లేదు.. ఒకవేళ జగన్ కు నిజంగా అంత ప్రజాబలం ఉంటే అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో కాకుండా అధికార పార్టీలాగా కొనసాగేవారు. పైగా తెలంగాణలో పార్టీ ఊసేలేకుండా పోయింది. కాబట్టి జగన్ కూడా బరిలో లేరు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైనా పోటీ ఇస్తారా అంటే కనీసం పేర్లు చెప్పడంలో కూడా చాలా మంది డౌట్ పడుతుంటారు. జానారెడ్డి అని కొంచెం అనుమానంగా అన్నా అస్సలు కాదు ఎందుకంటే... కనీసం ఎన్నికల్లో తాను గెలుస్తాడో కూడా తెలియని అయోమయం అతడిది. ఇక జానారెడ్డి మాట్లాడితే పార్టీ నాయకులే వినరు.. ఇక ప్రజలు ఎక్్డ విని.. ఓట్లేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు.

ఇలా మరి అన్ని పార్టీలు, వారి అభ్యర్థులు పోటీలో లేకుండా పోతే పరిస్థితి ఏంటీ అనుకుంటున్నారా..? కానీ ఒకే ఒక్కడు మాత్రం కేసీఆర్ కు పోటీ ఇవ్వగలడు. ఆ ఒక్కడు ఎవరు అనుకుంటున్నారా..? ఇంకెవరు కేసీఆరే. అవును తెలంగాణలో కేసీఆర్ కు కేసీఆరే పోటీ. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ కు పోటీలేరు.. పోటీ రారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles