Cricket-India spinners Ashwin, Jadeja bundle SA out for 79

Ashwin five for bundles south africa out for 79

Nagpur test, iindia vs south africa, ind vs sa, india south africa, ind vs sa 3rd test, india cricket, cricket india, south africa cricket, south africa vs india, sa vs ind, cricket score, cricket news, cricket, Murali Vijay, M Morkel, S Harmer, ravichandran ashwin, ravindra jadeja, amit mishra

And that's the end of that. Ashwin has taken his 14th fifer and South Africa have been bowled out for 79 - their lowest score vs India and 10th lowest ever.

అత్యల్పస్కోరుకే పఫారీలు అలౌట్.. భారత స్పిన్నర్లా మజాకా..!

Posted: 11/26/2015 11:13 AM IST
Ashwin five for bundles south africa out for 79

నాగ్ పూర్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజున భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు. భారత స్పిన్నర్ల ధాటికి సఫారీలు అత్యల్ప స్కోరుకే తోక ముడిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే మొత్తం వికెట్లు కోల్పోయి దారుణమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. టెస్టుల్లో భారత్‌పై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. భారత స్పిన్నర్ రవిచంద్రబన్ అశ్విన్ మరో మారు ఐదు విక్కెట్లను పడగొ్టాడు.

రెండు వికెట్ల నష్టానికి 11 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టుకు మన బౌలర్లు చుక్కలు చూపించారు. కేవలం 68 పరుగుల జోడించి మిగతా 8 వికెట్లను సఫారీలు చేజార్చుకున్నారు. 35 పరుగులతో డుమిని టాప్ స్కోరర్ గా నిలువగా, హ్మర్ 13, డూస్లెసిస్ 10 పరుగులు చేశారు. వివిలియర్స్, వాన్ జిల్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యి వెనుదిరిగారు. కాగా మిగిలిని ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

భారత బౌలర్లలో అశ్విన్ 5, జడేజా 4 వికెట్లు పడగొట్టారు. రవిచంద్రన్ అశ్విన్ ఈ సిరీస్ లో ఐదు వికెట్లను తన ఖాతోలో జమ చేసుకోవడం ఇది మూడోసారి. అమిత్ మిశ్రా ఒక వికెట్ దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా 79 పరుగులకు ఆలౌట్ కావడంతో టీమిండియా 136 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 215 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. మురళీ విజయ్(40), జడేజా(34), సాహా(32) పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్లు గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 4, మోర్కెల్ 3 వికెట్లు పడగొట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  nagpur test  south africa  cricket  

Other Articles