Amazing rare 'triple sunrise' caught on camera believed to be sign of harsh winter

Amazing triple sunrise strikes locals with awe at rare event

'triple sunrise' in siberia, 'triple sunrise' in russia, 'triple sunrise' in china, sign of harsh winter, rare optical illusion triple sun rise, triple sunrise over Russia, triple sunrise over city of Chelyabinsk, triple sunrise photos viral, viral photos. triple sunrise photos on social media.

Amazing rare phenomenon in Siberia as Three suns appeared in the sky. This shows a rare optical illusion taking place over Siberia as three suns appear in the sky.

ITEMVIDEOS: అంతరిక్షంలో అద్భుతం.. సైబీరియాలో ముగ్గురు సూర్యుళ్లు

Posted: 11/26/2015 11:10 AM IST
Amazing triple sunrise strikes locals with awe at rare event

అంతరిక్షంలో అద్భుతం చోటుచేసుకుంది. కేవలం రష్యాలోని సైబిరియా ప్రాంతంలో గల యూరల్‌ పర్వతాల సమీపంలోని వారికి మాత్రమే ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం కలిగింది. అదేంటి అనుకుంటున్నారా..? అదే సూర్యోదయం. ప్రతి రోజు మేము వేకువనే సూర్యోదయాన్ని వీక్షిస్తున్నాం అంటున్నారా..? అయితే మీకు ఎందరు సూర్యుళ్లు కనిపించారు. ఒక్కరే కదా..? కానీ సైబిరాయాలోని యూరల్ పర్వతాల సమీపంలోని ప్రజలకు ముగ్గురు సూర్యుళ్లు దర్శనమించారు. అదేంటి విచిత్రంగా వుందే..?అని కోందరు... ఇదివరకెప్పుడో విన్నట్లుగా వుందే..? అని మరికోందరు... ఓహో ఇది అదే కదా..? అని ఇంకోందరు వ్యాఖ్యానిస్తున్నారు కదూ..

ఔను నిజమే.. ఇది నిజంగా విచిత్రమైన అద్భుతమే.. గతంతో చైనా వాసులకు ఇదే విధంగా ముగ్గరు సూర్యుళ్లు కనిపించారు. అదే తరహాలో తాజాగా రష్యాలోని సైబిరియా యూరల్ పర్వతాలలో అదే ధృశ్యం అవిష్కృతమైంది. అయితే ఇంకోందరు అన్నుకున్నట్లు ఇది అదే.  అంటే నిజానికి ఈ చిత్రంలో ఉన్న సూర్యుడు ఒక్కడే. వాతావరణంలోని మంచు ఫలకాల (క్రిస్టల్స్‌) గుండా ప్రసారమైన కాంతి మూలంగా మూడు సూర్యబింబాలు కనిపిస్తున్నాయి.

తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయినపుడు పార్‌హెలియన్‌గా వ్యవహరించే ఈ అరుదైన దృశ్యం గోచరిస్తుందట. అయితే దీనిని బట్టి ఈసారి చలి తీవ్రంగా ఉంటుందనే వాతావరణ నిపుణులు, స్థానికులు పేర్కోంటున్నారు. ఈ దృశ్యం అవిష్కరించిన సమయంలో సైబిరియాలో అనేక రోడ్డు ప్రమాదాలు సంభవించాయట. ప్రమాదానికి లోనైప్పుడు కానీ వాహనదారులు తాము రోడ్డును కాకుండా అకాశంలోని అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తున్నామన్న సంగతి తెలియలేదట. మరి జాగ్రత్త సుమండీ..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : triple sunrise  siberia  harsh winter  russia  

Other Articles