Gujarat CM Anandiben Patel faces Patidar protest

Gujarat cm anandiben patel faces patidar protest

CM, Gujarat, Anandi ben Patel, Protest, Patdars, Patels, reservations, OBC

A day after Gujarat chief minister Anandiben Patel asserted there was no question of providing reservation in jobs and education to Patidars, men and women from her community on Wednesday demonstrated as she campaigned in her home district Mehsana.

సిఎంకు నిరసన సెగలు.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

Posted: 11/26/2015 08:15 AM IST
Gujarat cm anandiben patel faces patidar protest

నిరసనల సెగలు మామూలుగా అయితే మంత్రులు, ఎమ్మెల్యేలకు తగులుతుంటాయి. అయితే కొన్నిసార్లు పరిస్థితులు మారిపోతుంటే మాత్రం సిఎంకు కూడా నిరసనలను ఎదర్కోక తప్పదు. తాజాగా ఓ రాష్ట్ర సిఎంకు నిరసన జ్వాలలు తగలడంతో రంగంలోకి దిగిన పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. నిరసనకారుల మీద లాఠీలతో విరుచుకుపడ్డారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు లెండి. దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా కొనసాగుతున్న గుజరాత్ లో జరిగిన ఘటన ఇది. అక్కడి ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ కు ఎదురైన అనుభవం ఇది.

గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో చేస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ ను అడ్డుకునేందుకు యత్నించిన పటేల్ కమ్యునిటీ పై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఆమె సమీపంలోకి పటేల్ కమ్యునిటీ సభ్యులెవరినీ రానివ్వకుండా జాగ్రత్తపడ్డారు. సీఎం ఆనంది బెన్ కు నిరసన తెలుపుతున్న పటేదార్ లపై పోలీసులు లాఠీ చార్జీ చేసి, వారిని చెదరగొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన సీఎం రోడ్ షో నిర్వహిస్తున్నారని తెలిసి పటేల్ కమ్యునిటీకి చెందిన 500 మందికి పైగా మహిళలు యువకులు గుమికూడారు. ఓబీసీలలో తమను చేర్చాలని నినాదాలు చేశారు. మెహస్నా జిల్లా నాగల్పూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. లాఠీ చార్జిలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. పటేదార్ లు పెద్దసంఖ్యలో ఉన్న విసునగర్ లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. గుజరాత్ లో 29 జిల్లా పంచాయత్ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ 29న జరుగాల్సిఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM  Gujarat  Anandi ben Patel  Protest  Patdars  Patels  reservations  OBC  

Other Articles