Tollywood singer Kousalya files harassment case against husband

Singer kousalya files harassment case on husband

husband harassment, singer kousalya, police complaint, Tollywood Singer, Kousalya, Kousalya Files Harassment Case, harrament on celebrities,sunitha, violence against women, crime against women, attrocity at women, harrassment on women

Popular Tollywood play back singer Kousalya filed a harassment case against her husband Balasubrahmanyam at the Sanjeeva Reddy Nagar police station.

ITEMVIDEOS: భర్త వేధింపులపై కేసు పెట్టిన టాలీవుడ్ గాయిని..

Posted: 11/24/2015 06:56 PM IST
Singer kousalya files harassment case on husband

సెలబ్రిటీలకు సైతం వేధింపులు తప్పడంలేదు. తన భర్త వేధిస్తున్నాడంటూ గాయని కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. గత కొంత కాలంగా తన భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా తన భర్తపై 498ఎ సెక్షన్ కింద ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు మూడు విడతలుగా ఇద్దరికీ కౌన్సెలింగ్ చేయాల్సి ఉంటుంది.

ఈ మేరకు గతంలో కౌన్సెలింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయినా బాలసుబ్రహ్మణ్యంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆమె ఫిర్యాదు మేరకు అతడిపై 506, 507 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తానేమీ చేయలేదని, కావాలనే ఫిర్యాదు చేస్తోందని బాలసుబ్రహ్మణ్యం పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కౌసల్య సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం.

నాగార్జున సాగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు. గుంటూరు మహిళా కళాశాలలో ఇంగ్లీషు లిటరేచర్, కర్ణాటక సంగీతాల్లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం పద్మావతి యూనివర్సిటీలో శాస్త్రీయ సంగీతంలో పీజీ చేశారు. చిన్ననాటి స్నేహితుడైన బాల సుబ్రహ్మణ్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. 1999లో 'మీ కోసం' సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించారు. పలు స్టేజి కార్యక్రమాలలో కూడా ఆమె తరచు పాటలు పాడుతుంటారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband harassment  singer kousalya  police complaint  

Other Articles