What Aamir Khan is saying, whole world is saying: Cong on actor’s ‘intolerance’ remark

What aamir khan is saying all of india is saying congress

aamir khan, intolerance, congress, congress aamir khan, #rngawards, ramnath goenka awards, aamir khan congress, bjp, aamir on intolerance, kiran rao, aamir kiran rao, kiran rao intolerance, aamir awards

Taking a dig at BJP, Congress spokesperson Abhishek Singhvi said Khan should not be branded as a Congress man for raising the intolerance issue.

అమీర్ ఖాన్ కు అండగా నిలచిన అభిషేక్.. తప్పేముందని ప్రశ్న

Posted: 11/24/2015 05:17 PM IST
What aamir khan is saying all of india is saying congress

మత అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్‌ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఉదయం నుంచి బీజేపీ నేతలు, పార్టీ ముఖ్యులు సహా పలువురు పార్టీ అనుకూల నటులు, దర్శకులు కూడా అమీర్ పై విమర్శల పర్వ కురిపించిన నేపథ్యంలో.. ఎట్టకేలకు అమీర్ ఖాన్ కు ఓ అండ లభించింది. అభిషేక్.. అమీర్ కు అండగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అమీర్ ఖాన్ వ్యాఖ్యలను సమర్థించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతున్న వాటి గురించి అందరూ అంటున్నదే ఆమిర్ మాట్లాడారని ఆయన మద్దతుగా నిలిచారు.

'అగ్రహీరోల్లో ఒకరైన ఆమిర్‌ ఖాన్.. బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో తమ అసహనంపై గళం విప్పారు. మోదీ పాలన గురించి ప్రపంచమంతా, దేశమంతా చెప్పుకుంటున్నదే ఆయన చెప్పారు' అని సింఘ్వి తెలిపారు. సోమవారం ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్‌జర్నలిజం అవార్డుల ప్రదానోత్సవంలో మత అసహనంపై ఆమిర్‌ ఖాన్ మాట్లాడారు. త అసహనంపై గళం విప్పినంతమాత్రానా ఆమిర్‌ ఖాన్ ను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడిగా ముద్ర వేయడం తగదన్నారు.

ఆయన ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయలేదన్నారు. సినిమాల్లో కాకుండా నిజజీవితంలోనూ ఆమిర్‌ ఖాన్ సందేశాత్మకంగా వ్యవహరించారని సింఘ్వి ప్రశంసించారు. ఇక పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అమీర్ ఖాన్ కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్విట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిని వారిని దేశ ద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా, ప్రేరణ పొంది మాట్లాడుతున్నవారిగా ముద్ర వేయడం తప్పుగా అయన ట్విట్ చేశారు. విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిని పరష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై వుందన్నారు. సమస్యలను పరిష్కరించడం మాని, అసహనంపై వ్యాఖ్యలు చేసిన వారిని బెదరించో, భయపెట్టో తమ దారిలోకి తెచ్చుకోవాలనుకోవడం తప్పని రాహుల్ ట్విట్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir Khan  Congress  Abhishek Singh  Bjp  Bollywood  intolerance  

Other Articles