TRS party candidate great victory in Warangal elections

Trs party candidate great victory in warangal elections

warangala polls, TRS Great victory, TRS Won, Warangal for TRS, TRS VIctory in Warangal Bypolls, Warangal Results, Pasunuri Dayakar

TRS Party candidate Pasunuri Dayakar got excellent majority and record great victory in warangal elections. He got four lakh fifty nine thousand ninty two votes.

వరంగల్ లో టిఆర్ఎస్ విజయం

Posted: 11/24/2015 03:05 PM IST
Trs party candidate great victory in warangal elections

ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అన్నట్లు వరంగల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పసనూరి దయాకర్ దిమ్మతిరిగేలా ఓట్లను సొంతం చేసుకున్నాడు. ముందు నుండి కూడా లీడ్ లో కొనసాగిన దయాకర్ చివరకు రికార్డ్ స్థాయిలో మెజార్టీ సంపాదించారు. కారు దెబ్బకు వరంగల్ లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లందయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి, బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థిని అందుకోవడంలో విఫలమయ్యారు. ఓరుగల్లు ఖిల్లా రాజు ఎవరా అన్న ఉత్కంఠకు తెర పడింది. వరంగల్ లో గులాబీదళానికి పట్టం కట్టిన ఓటర్లు.. భారీ మెజారిటీతో పసనూరి దయాకర్ ను గెలిపించారు. టిఆర్ఎస్ అభ్యర్థి నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల తొంభై రెండు ఓట్లతొ గెలుపును సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ లక్ష యాభై ఆరు వేల మూడు వందల పదిహేను ఓట్లు, బిజెపి అభ్యర్థి పగిడిపాటి యాదయ్య లక్ష ముప్పై వేల నూటడెబ్బై ఎనిమిది ఓట్లను సంపాదించారు. ఇక వైసీపీ అభ్యర్థి సూర్యప్రకాశ్ కు కేవలం ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై ఐదు మాత్రమే వచ్చాయి.

Also Read: కారోళ్లు హుషారు.. మిగిలిన వాళ్లు బేజారు

టిఆర్ఎస్ అభ్యర్థికి పసనూరి దయాకర్ కు వచ్చిన ఓట్లు... 4,59,092
కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు వచ్చిన ఓట్లు.........1,56, 315
టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి యాదయ్యకు వచ్చిన ఓట్లు...1,30, 178
వైసీపీ అభ్యర్థి సూర్య ప్రకాశ్ కు వచ్చిన ఓట్లు.........................23,325

Also Read: వరంగల్ కింగ్.. దయాకర్

వ‌రంగ‌ల్ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ విజ‌య‌దుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్య‌ర్థి ప‌సునూరి ద‌యాక‌ర్ 4,59,092 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దేశంలోనే ఆరో అత్య‌ధిక మెజారిటీ సాధించిన వ్య‌క్తిగా చ‌రిత్ర పుట‌ల్లోకెక్కారు.మెజారిటీప‌రంగా చూస్తే ప‌సునూరిది దేశ‌వ్యాప్తంగా ఆరో అత్య‌ధిక మెజారిటీగా రికార్డ‌యింది. అంత‌కు ముందు 2014లో జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి ప్రీత‌మ్ ముండే బీడ్ పార్ల‌మెంట్ స్థానం నుంచి 7 ల‌క్ష‌ల ఓట్ల‌కు పైగా మెజారిటీ సాధించి దేశ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో అత్య‌ధిక మెజారిటీ సాధించిన మొద‌టి అభ్య‌ర్థిగా రికార్డు సృష్టించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles