Rahul Gandhi support Amir Khan

Rahul gandhi support amir khan

Rahul Gandhi, Rahul Gandhi support to Amir Khan, Rahul on Intolerance, Intolerance in India, Amir Khan, Anupam Kher, intolarence, India, Modi, Intolarence in India, Anupam Kher on Amir Khan

AICC Vice President Rahul gandhi support Amir Khan on his intolerance statements. He tweetsThat's the way to solve problems in India- not by bullying, threatening & abusing!

అమీర్ ఖాన్ కు బాసటగా రాహుల్ గాంధీ

Posted: 11/24/2015 01:44 PM IST
Rahul gandhi support amir khan

దేశంలో అసహనం పేరుతో రేగుతున్న దుమారానికి రాజకీయ కోణం కూడా తోడవుతోంది. తన బార్య తనతో దేశం వదిలివెళ్లడానికి చెప్పిందని అమీర్ ఖాన్ సంచలనానికి తెర తీశారు. అయితే దీని మీద పెద్ద దుమారమే రేగింది. అమీర్ ఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తు.. అనుపమ్ ఖేర్, రాంగోపాల్ వర్మ, మనీష్ తివారీలాంటి వాళ్లు ట్వీట్లు చేశారు. గతంలో ఇంక్రిడెబుల్ ఇండియా(గొప్ప దేశం) కాస్త ఇంటోలరెంట్ ఇండియా (అసహనం) ఎలా అయ్యిందని ప్రశ్నించారు. దేశంలోని అన్ని మతాల వాళ్లు మీ సినిమాలు చూడబట్టే మీరు అమీర్ ఖాన్ అయ్యారని మరోకరు.. ఇలా అమీర్ ఖాన్ మీద అందరూ విమర్శలకు దిగుతుంటే.. ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మాత్రం అమీర్ ఖాన్ కు బాసటగా నిలుస్తున్నారు.

Also Read: అమీర్ కు తలంటిన రాంగోపాల్ వర్మ
Also Read: అమీర్ ఖాన్ ఇది కరెక్ట్ కాదు.. ఏం చెప్పాలనుకున్నావు..?

దేశంలో పెరుగుతున్న అసహనం మీద అమీర్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని రాహుల్ చెప్పుకొచ్చారు. తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేసిన రాహుల్ దేశంలో మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలా ఎవరో వెనకినుండి నడిపిస్తున్నారని, దేశభక్తి లేని వాడని అంటున్నారని విమర్శించారు. విమర్శలు చేసిన వారిని బెదిరించడం, భయపెట్టడం లాంటివి సమస్యకు పరిష్కారం కాదని.. ప్రజల్లోకి వెళ్లి సమస్యకు పరిష్కరాలను కనుక్కోవాలని రాహుల్ సూచించారు.



*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles