Telangana Bandh today

Telangana bandh going but not fully sucessfull

Telangana Bandh, bandh, Telanagana, farmers, Suicides, Oppositions in Telangana

Telangana bandh going but not fully sucessfull. Telangana opposition parties doing telangana band but bandh not effect in hyderabad. Opposition party leaders arrested

కొనసాగుతున్న తెలంగాణ బంద్

Posted: 10/10/2015 08:04 AM IST
Telangana bandh going but not fully sucessfull

అన్నదాతల పంట రుణాన్ని ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ, రైతుల సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన బంద్ ఈ తెల్లవారు జాము నుంచే ప్రారంభమైంది. రుణ మాఫీకి ఏకమొత్తంలో నిధులు విడుదల చేయాలని, రైతుల ఆత్మహత్యల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలన్నీ ఒక్కటై శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు వివిధ జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలకు దిగారు. హైదరాబాద్ లో దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డీపో ముందు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బైఠాయించారు. ఆయనను పోలీసులు అరెస్టు చేసి అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు  చేశారు.

జూబ్లీబస్టాండ్‌ ఎదుట విపక్షాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్‌. రమణ, రేవంత్‌రెడ్డి, సాయన్న మాగంటి గోపీనాథ్‌, లక్ష్మణ్‌, చింతల, పొంగులేటి తదితరులను  పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా విపక్షాల బంద్ ప్రబావం తెలంగాణ జిల్లాలో కాస్త ప్రభావం చూపుతున్నా.. హైదరాబాద్ నగరంలో మాత్రం ఎలాంటి ప్రబావం చూపించడం లేదు. సిటీ సర్వీస్ బస్సులు యదాతదంగా నడుస్తున్నాయి. బంద్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోల నుంచి బస్సులు బయటికి రాలేదు. ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లోని బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ తాను చెప్పిన హామీలను అమలు చేయడం లేదని రాంరెడ్డి దామోదర్-రెడ్డి విమర్శించారు. రోజు రోజూకూ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Bandh  bandh  Telanagana  farmers  Suicides  Oppositions in Telangana  

Other Articles