Transgender man's 1400 daily selfies documenting transition go viral

Transgender man documents transition with series of selfies

channel 4, 4od, entertainment, british television, broadcaster, Transgender, ,LGBTQ,Selfie,Timelapse Video, trending transgender selfie video, viral video, transgender viral video, Jamie Raines, transgender man, selfie video, Testosterone

Jamie took a selfie every day for three years and stitched it into a single time-lapse video to record the change she underwent.

ITEMVIDEOS: ఆ సెల్పీల వీడియోతో.. తానెలా మగాడిగా మారోడో చూపుతున్న ఓ అమ్మాయి

Posted: 10/09/2015 10:20 PM IST
Transgender man documents transition with series of selfies

ఓ అమ్మాయి తాను పురుషుడిలా మారాలనుకుంది. తనకు అమ్మాయిలా వుండాలని ఇష్టం లేదు. దీంతో మగాడిలా మారేందుకు మూడేళ్లపాటు చేసిన కృషి చేసింది. అయితే అమె కృషి ఫలించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతకీ అమె సాధించేంటి అంటే పురుషుడిలా మారడమే.. ఎస్సెక్స్ యూనివర్సిటీ సైకాలజీ స్టూడెంట్ జేమీ రైన్స్ అనే యువతి.. తాను అబ్బాయిగా మారాలని  గట్టిగా నిర్ణయించుకుని అలా మారింది. అంతేకాదు ఈ మూడేళ్ల కాలంలో అమె ప్రతీరోజు తీసుకున్న సెల్పీ.. వీడియో మలిచి సోషల్ మీడియాలో పెట్టడంతో దానిని కొద్ది రోజుల్లోనే కోట్ల మంది వీక్షించారు.

జేమీకి సరిగ్గా నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు తాను అందరిలా కాకుండా భిన్నంగా ఉన్నట్లు అనిపించిందట. ఎనిమిదేళ్ల వయసులో హెయిర్ కట్ చేసుకుని తాను అబ్బాయిగా కనిపిస్తున్నట్లు అద్దంలో చూసుకునేది. కొన్నేళ్ల తర్వాత అమ్మాయిల పట్ల ఆకర్షణ కలిగి, తరచు గర్ల్ ఫ్రెండ్ షాబాను కలుసుకునేది. 18 ఏళ్లు వచ్చాక, ప్రతిరోజూ టెస్టోస్టిరాన్ హార్మోన్ తీసుకోవడం ప్రారంభించింది. అలా చేయడంతో పాటు తనలో వస్తున్న శారీరక మార్పును తెలుసుకునేందుకు ప్రతి రోజూ సెల్ఫీ తీసుకునేది. లింగమార్పిడి కోసం సర్జరీ చేయించుకోవడంతో పాటు మూడేళ్ల పాటు ప్రతి రోజూ అందుకు అవసరమైన మందులు వాడేది. మూడేళ్ల తర్వాత ఆమెగా ఉన్న జేమీ రైన్స్... పూర్తిగా అతడుగా మారిపోయాడు.

హార్మోన్ తీసుకుంటున్న క్రమంలో తనలో కలిగే మార్పులను తెలుసుకునేందుకు తీసిన 1400 ఫొటోలను వీడియోగా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. 7 లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియో చూసిన ఓ న్యూస్ చానెల్ ఆమె నుంచి అతడుగా మారే క్రమంపై 'గర్ల్స్ టు మెన్' అనే డాక్యుమెంటరీ తీయడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు తనకు చాలా ధైర్యంగా ఉందని, ఆత్మవిశ్వాసం పెరిగిందని జేమీ అంటున్నాడు. నాలుగేళ్లుగా తనతో పరిచయం ఉన్న గర్ల్ ఫ్రెండ్ షాబా కూడా లింగమార్పిడి విషయంలో తనకు చాలా సహకారం అందించిందని చెప్పాడు. షాబా పేరెంట్స్ మొదట్లో తనతో పెళ్లికి ఒప్పుకోలేదు గానీ, పూర్తిగా అబ్బాయిగా మారిన తర్వాత వారు తనను అంగీకరించారన్నాడు. అయితే, తన పేరు ఇప్పుడు జేమీ అని చెప్పుకొచ్చాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jamie Raines  transgender man  selfie video  Testosterone  

Other Articles