balaram nayak | telangana | Andhra pradesh | warangal parliament | bye elections

Former union minister controversy remarks

balaram nayak, telangana, Andhra pradesh, warangal parliament, bye elections, sonia gandhi, mother of telangana, former union minister, warangal, narampet rathu barosa yatra, balaram nayak controversy remarks

former union minister balaram nayak controversy remarks on telangana, rock congress activists in narsampet rathu barosa yatra.

తెలంగాణను ఆంధ్రాలో కలుపుతాం.. నాలుక కర్చుకున్న మాజీ కేంద్ర మంత్రి..

Posted: 10/09/2015 09:19 PM IST
Former union minister controversy remarks

చదివితే ఉన్నమతి పోతుందన్నేది నానుడి.. కానీ ఇక్కడ ఓ కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఓ నాయకుడికి పదవితో పాటు మతి కూడా పోయిందంటున్నారు విమర్శలకులు. అదేంటో అర్థం కాలేదా..? కేంద్ర మాజీ మంత్రిగా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బలరాం నాయక్ అదే తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం తొలి పోరు, మలిపోరు ఎంతలా జరిగినా.. చివరకు ఇచ్చింది మాత్రం తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అంటూ.. అందుకనే వరంగల్ ఎంపీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేసి తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలని అన్నారు.

అయితే ఈ విషయంలో ఎక్కడో, ఏ మూూలో అనుమానం వున్న ఆయన ఎరక్కబోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. వరంగల్ ఎంపీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కలుపుతామని వ్యాఖ్యానించారు. దీంతో కార్యకర్తలు, ప్రజలు వ్యతిరేకించడంతో బలరాం నాయక్ నాలుక్కరచుకున్నారు. వెంటనే తేరుకుని సరదాగా అన్నానని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. శుక్రవారం జిల్లాలోని నర్సంపేటలో కాంగ్రెస్ నిర్వహించిన రైతు భరోసా యాత్రలో పాల్గొన్న బలరాం నాయక్ పైవిధంగా వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balaram nayak  telangana  Andhra pradesh  warangal parliament  bye elections  

Other Articles