Bihar Assembly Elections: Pre-poll surveys project Nitish's victory

Cnn ibn axis pre poll survey forecasts bjp defeat in bihar

Abp News nielson survey pre-election survey JD(U) NDA grand alliance CNN IBN/IBN7-Axis, bihar elections 2015, bihar polls 2015, pre poll survey

The Grand Alliance led by Bihar Chief Minister Nitish Kumar is tipped to win a simple majority in the assembly polls starting on Monday, a pre-election survey said.

రసవత్తరంగా సాగనున్న బీహార్ ఎన్నికలు.. ప్రీఫోల్ సర్వేలో మిశ్రమ ఫలితాలు

Posted: 10/08/2015 10:20 PM IST
Cnn ibn axis pre poll survey forecasts bjp defeat in bihar

బిహార్ ఎన్నికల తొలిధశ పోలింగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కావడంతో ఇవాళ రమారమి అన్ని మీడియా ఛానెళ్లు అక్కడి అసెంబ్లీ ఎన్నికలు.. గెలుపు గుర్రాలు.. ఎవరికి అధికారం లభిస్తుందన్న అంశాలనే హైలైట్ గా చేసుకుని వార్తలను ప్రసారం చేస్తున్నాయి. బీహార్ వాసులు ఈసారి ఎటు మొగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. జేడీయూ అత్యల్ప మోజారిటీతో మరోమారు అధికారం చేజిక్కించుకుంటారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మీడియా సంస్థల్లో చాలావరకు ఇదే విషయం చెబుతున్నాయి. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే 122 స్థానాలు దక్కాలి.

ఏబిపి నీల్సన్ సర్వే ప్రకారం బీజేపి ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 128 స్థానాలను దక్కించుకుంటుందని అంచనా వేయగా, నితీష్ 122 స్థానాలను దక్కించుకుంటారని మిగిలిన వారు కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలుచుకనే అవకాశాలు వున్నాయని తెలిపింది. కాగా ఐబిఎన్ యాక్సిస్ సర్వే ప్రకారం జేడీయూ 137 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని అందిపుచ్చుకుంటుందని అంచనా వేసింది. కాగా బీజేిప మిత్రపక్షాల కూటమికి కేవలం 95 స్థానాలు మాత్రమే లభిస్తాయని పేర్కోంది. జేడియూ కూటమికి 46 శాతం ఓట్లు వస్తాయని కూడా అంచనా వేసింది.

ఇండియా టీవీ- సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 119, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమికి 116 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. మరో 8 స్థానాలు మాత్రం ఇతరులకు దక్కుతాయన్నారు. అంటే, ఎన్డీయే కూడా అధికారానికి కొద్ది దూరంలో ఆగిపోతుందని అంచనా వేశారన్నమాట. ఇండియా టుడే- సిసెరో సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో, ఆ రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 125 స్థానాలను, జేడీ(యూ) నేతృత్వంలోని మహాకూటమి 106 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు. 2010లో ప్రస్తుత జేడీయూ కూటమికి 141 స్థానాలు రాగా, ప్రస్తుత బీజేపీ కూటమి 94తో సరిపెట్టుకుంది.

ప్రధాని నరేంద్రమోదీ ఏడాదిన్నర పాలనకు ఒకరకంగా ఇది ప్రోగ్రెస్ కార్డు అని కొందరు అంటుంటే, నితీష్ కుమార్ సారథ్యంలో బిహార్ రాష్ట్రం ఎంతవరకు ముందడుగు వేసిందో తెలిపే మార్కు అని మరికొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా టుడే- సిసెరో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. బిహార్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఇప్పటికీ నితీష కుమారేనని అంటున్నారు. ఆయనకు గతంలో 29 శాతం ప్రజాదరణ ఉండగా ఇప్పుడది 38 శాతానికి పెరిగిందంటున్నారు. ఆయన తర్వాతి స్థానంలో మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీ నిలిచారు. ఆయనకు 22 శాతం ప్రజాదరణ ఉన్నట్లు తేలింది. లాలు ప్రజాదరణ మాత్రం 12 శాతం నుంచి 9 శాతానికి పడిపోయిందట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar elections 2015  bihar polls 2015  pre poll survey  

Other Articles