denied railway job despite scoring 96 in recruitment exam

Denied job for scoring way above the cut off mark youth seeks pm modi s help

railway recruitment exam, lalith kumar, Narendra modi, Central Information Commission (CIC), railway job aspirant seeks Modi’s intervention, asporant got 96 percent in recruitment exam

A young man here is seeking Prime Minister Narendra Modi’s intervention after the railways denied him a job although he secured 96 percent in a recruitment exam.

ప్రధాని మోడీగారూ.. నాకు రావాల్సిన ఉద్యోగం నాకిప్పంచరూ.. ప్లీజ్..!

Posted: 10/08/2015 09:01 PM IST
Denied job for scoring way above the cut off mark youth seeks pm modi s help

ఉద్యోగం కోసం పరితపిస్తూ.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి.. అందివచ్చిన రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలో కష్టపడి 96 శాతం మార్కులు సాధించాడు ఆ యువకుడు. అయినప్పటికీ అతనికి ఉద్యోగం రాలేదు. దీంతో హతాశుడైన ఓ యువకుడు తనకు న్యాయం చేయాల్సిందిగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని కోరాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన లలిత్ కుమార్ 2013 డిసెంబర్లో నార్తర్న్ గ్రూప్-డి పరీక్ష రాశాడు. బాగా రాసినప్పటికీ ఉద్యోగానికి ఎంపిక కాకపోవడంతో అనుమానం వచ్చిన అతడు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించాడు. ఏడాది తర్వాత సమాధానం వచ్చింది.

అక్రమ పద్ధతులతో మార్కులు సాధించినందున అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లు అందులో పేర్కొన్నారు. తాను ఎంతగానో కష్టపడి రాసిన పరీక్షలను అక్రమ పద్దతుల ద్వారా రాసారంటూ బదులు రావడంతో అతను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ను ఆశ్రయించాడు. లలిత్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణాలను 30 రోజుల్లోగా తెలపాలంటూ నార్తర్న్ రైల్వేకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారిని సీఐసీ గత ఆగస్టు 10న ఆదేశించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాసినట్లు తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : railway recruitment exam  lalith kumar  Narendra modi  

Other Articles