Bhagwat reservation comment: Lalu asks PM Modi to clarify his stance on the issue

Lalu prasad questions modis silence on reservation issue

lalu prasad yadav, narendra modi, mohan bhagwat, reservation policy review, Bihar assembly elections, reservation, amit shah, rss chief reservation policy, modi on reservation policy, bihar elections, bihar polls, bihar news, india news, latest news

The RJD chief, who has been under attack from NDA over his "Hindus too eat beef comment", raised the reservation issue seeking to put Modi on the defensive.

ఆడలేక మధ్యల ఓడన్నట్లు.. అభివృద్ది మంత్రం అంటూనే ఫ్రీ తాయాలాలా..?

Posted: 10/08/2015 05:00 PM IST
Lalu prasad questions modis silence on reservation issue

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలు ప్రసాద్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రపంచ దేశాల పర్యటనలకు వెళ్లి అక్కడ తన అభివృద్దితో దేశం వెలుగుతోందని ఢంకా బజాయించుకుంటున్నారని విమర్శించారు. నిజానికి అదే అతని మంత్రం అయితే..  ఫ్రీ తాయిలాలు ఎందుకు ప్రకటిస్తున్నారని ఆయన నేరుగా ప్రదానిని టార్గెట్ చేసి ప్రశ్నించారు. మీ అభివృద్ది మంత్రం మీద మీకే నమ్మకం లేకపోయిందా..? అన్ని నిలదీశారు. బిహార్ను అభివృద్ధి చేస్తామని ధీమా ఉంటే స్కూటీలు, టీవీలు, ల్యాప్టాప్స్ ఇస్తామంటూ బీజేపీ ఎందుకు ప్రచారం చేస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు.

రిజర్వేషన్లకు ఆయన వ్యతిరేకమా, అనుకూలమా అన్న విషయాన్ని మోదీ స్పష్టం చేయాలన్నారు. ఒకవేళ ఆయన వ్యతిరేకిస్తే.. 'ప్రధాని నకిలీ ఓబీసీ' అవుతాడంటూ లాలు పేర్కొన్నారు. ఆరెస్సెస్పై కూడా విమర్శలు గుప్పించారు. దళితులు, ఓబీసీలను బానిసలుగా ఉంచటమే వారి ప్రధాన ఎజెండా అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. మోదీని గద్దెదింపి తాను ప్రధాని అవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలలు కంటున్నారని ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు. దళితులు, ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పన అంశాన్ని సమీక్షించాలంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని లాలు ఈ సందర్భంగా ప్రశ్నించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad  Narendra Modi  Bihar assembly elections  reservation  amit shah  

Other Articles