bjp mlas thrash independent mla engineer rashid in jammu kashmir assembly

Independent mla assaulted in j k assembly for hosting beef party

beef, jammu assembly, kashmir assembly, j k assembly, beef party, mla beef party, engineer rashid, ravinder raina, bjp, kashmir assembly violence, kashmir assembly beef, beef kashmir, beef ban, dadri, dadri beef, dadri lynching, india news, latest news

The opposition has condemned the attack on Rashid and former Chief Minister Abdullah drew its parallels with the Dadri lynching.

అసెంబ్లీ తీర్మాణాన్ని ఎమ్మెల్యేనే పాటించరా..? నిండు కొలువులో పరాభవం..!

Posted: 10/08/2015 03:00 PM IST
Independent mla assaulted in j k assembly for hosting beef party

దేశవ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం గోమాంసం నిషేదం. కొందరు దీనిని సమర్ధిస్తే.. అనేక మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. సరిగ్గా ఇలానే ఆ రాష్ట్రంలోని రెండు వేర్వేరు న్యాయస్థానాలు వేర్వేరు అభిప్రాయాలను వెలువరించడంతో.. జమ్మూకాశ్మీర్ లో గోమాంసం తీవ్ర దుమారాన్ని లేపుతుంది. చివరకు అది ఎంతవరకు దారితీసిందంటే.. జమ్ముకశ్మీర్ అసెంబ్లీలోనే దుమారం రేపింది. పవిత్రమైన చట్టసభలో శాసనసభ్యులు తిట్టుకుని, కొట్టుకునే వరకు దారి తీసింది.

బీఫ్ వివాదాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చేందుకు అసెంబ్లీ సాక్షిగా బీఫ్ పార్టీ ఇచ్చిన ఓ ఎమ్మెల్యేను తోటి సభ్యులు అసెంబ్లీలోనే చితకబాదారు. జమ్ము కశ్మీర్లో బీఫ్పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్ బీఫ్ పార్టీ ఇచ్చారు. శ్రీనగర్ ఎమ్మెల్యే హాస్టల్లోఈ పార్టీ ఏర్పాటు చేశారు. బీఫ్ను నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లు పాసయినా తాను ఖాతరు చేయబోనని అన్నారు. గురువారం అసెంబ్లీ ప్రారంభంకాగానే ఈ విషయంపై దుమారం చెలరేగింది. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు గగన్ భగత్, రాజీవ్ శర్మలు.. రషీద్పై దాడి చేశారు.

నిండు సభలో శాసనసభాపతి కవీందర్ గుప్తా ఎదుటే ఆయన్ను చితకబాదారు. బీజేపి ఎమ్మెల్యేలు సభలో దౌర్జన్యం చేస్తున్నా.. మిన్నకుండిపోయిన స్పీకర్ నిశ్చేష్టుడై ప్రేక్షకపాత్ర వహించారు. ఈ సమయంలో ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన ఎమ్మెల్యేలు రషీద్ను కాపాడారు. శాసనసభ్యుడిని తోటి ఎమ్మెల్యేలు దాడి చేసి చావచితకబాదటం దురదృష్టకర సంఘటన అని ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ సంఘటనను ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ఖండించారు. అయితే బిజేపి సభ్యులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీజేపి సహకారంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న పిడీపీ ఈ ఘటనను ఖండించడం కన్నా.. ధైర్యముంటే మద్దత్తును వదులుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా అసెంబ్లీ సాక్షిగా తీర్మాణం చేసినా.. దానిని ఎమ్మెల్యేనే పాటించని పక్షంలో ఇక ప్రజలెలా పాటిస్తారని విమర్శలు కూడా వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MLAs  independent MLA  jammu kashmir assembly  engineer rashid  

Other Articles