Indian lass killed by Pakistani lad in dubai

Indian girl killed by pakistani boy in uae

indian girl killed by pakisthan girl, girl killed in uae, indian lass stabbed, boy kills a girl of india, indian girl, pakisthan boy, indian girl murdered in uae, indian lass stabbed, pakistan boy kills a indian girl, uae, love proposal, reject, immolate

A 14-year-old Indian girl in the UAE has been reportedly stabbed to death by a Pakistani boy before immolating himself after she turned him down, according to a media report.

పాకిస్థాన్ ప్రేమోన్మాది చేతిలో భారతీయ బాలిక హత్య

Posted: 10/07/2015 09:39 PM IST
Indian girl killed by pakistani boy in uae

అసలే దాయాధి దేశాల మధ్య ఉప్పు, నిప్పులా వున్న పరిస్థితులు ఇప్పుడు దేశం కాని దేశంలో కూడా అగ్గిని రాజేస్తున్నాయి. తన ప్రేమను తిరస్కరించిందన్న అగ్రహంతో రెచ్చిపోయిన ప్రేమోన్మాది అభం శుభం తెలియని 14 ఏళ్ల భారతీయ బాలిక కత్తితో దారుణంగా పోడిచి హతమార్చాడు. అయితే ఆ ప్రేమోన్మాది పాకిస్థాన్ కు చెందిన వాడని సమాచారం. అతడి వయసు కూడా 14 ఏళ్లే. ఈ దారుణం దుబాయ్లో జరిగింది. బాలికను కత్తితో పోడిచి హతమార్చిన పిదప, ఆ యువకుడి తనకు తాను ఆత్మాహుతి చేసుకున్నాడు. బాలిక తల్లి ఉద్యోగం కోసం బయటకు వెళ్లిన సమయంలో ఆ కుర్రాడు బాలిక ఉండే ఫ్లాట్కు వెళ్లాడు. తర్వాత వాళ్లిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో మాత్రం స్పష్టంగా తెలియలేదు.

ఆమెను కత్తితో కసితీరా పొడిచి చంపేసిన తర్వాత.. బాలికతో పాటు తనపై కూడా కిరోసిన్ పోసుకున్న బాలుడు నిప్పంటించుకున్నాడు. దాంతో ఆ ఫ్లాట్ లోని బెడ్రూం మొత్తం కూడా తగలబడిపోయింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత ఇద్దరి మృతదేహాలను వాళ్ల బంధువులకు అందిస్తామని పోలీసులు చెప్పారు. గదిలో ద్రవ ఇంధనం ఉందని అంటున్నారు. ఆ బాలిక మంచి డాన్సర్ కావాలని అనుకునేదని, ప్రముఖ భారతీయ నృత్యబృందంలో ఆమె సభ్యురాలని తెలుస్తోంది. బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian girl  pakisthan boy  uae  love proposal  reject  immolate  

Other Articles