Hero vijay | fans families | dead fans | console | family members | road accident | monetary help

Hero visits his dead fans houses to console

puli, vijay, vijay visits fans houses, sridevi, Hero visits his dead fans’ houses to console, Hero vijay, fans families, dead fans, console, family members, road accident, monetary help, kollywood

Tamil star hero Vijay visited and consoled the family members of two youth who passed away in a road accident on October 1, while on their way to watching his film ‘Puli’.

ఆ అభిమానుల కుటుంబాలకు హీరో పరామర్శ..

Posted: 10/07/2015 09:38 PM IST
Hero visits his dead fans houses to console

సినీమా హీరోలంటే అభిమానులకు ఎంత ఇష్టమో చెప్పనలవి కాదు. ఎందుకంటే మాత్రం కారణాలు వుండవు. అదేదో సినిమాలో చెప్పినట్లు ఓ మనిషిని తాను అభిమానించడానికి కారణాలు వుండవన్నట్లు.. హీరోల పట్ల అభిమానం కూడా అంతే. ప్రతీ హీరోకు అభిమానులు వుండటం మనకు తెలిసిందే. అభిమానుల దరి చేరడం మాత్రం  హీరోలకు అరుదనే చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో హీరోలు అభిమానులు దరికి చేరేందుకు వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే తమిళనాడులో ఇటీవల విడుదల పులి చిత్రం చూసేందుకు వెళ్లిన ఇద్దరు విజయ్ అభిమానులు రోడ్డు ప్రమాదంలో అసువులు బాసారు. వారికి ఎదురుగా వచ్చిన ఓ ట్రక్కు వారు వెళ్తున్న బైక్ ను ఢీకొనడంతో సినిమాకని వెళ్లిన వారు అనంతవాయువులలో కలసిపోయారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న కాలీవుడ్ హీరో విజయ్ అభిమానుల ఇళ్లకు వెళ్లి భాదిత కుటుంబసభ్యులను పరామర్శించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన విజయ్.. వారి లేని లోటును తీర్చలేదన్నారు. బాధిత కుటుంబాలకు కొంత డబ్బును అర్థిక సాయంగా అందించారు. తన ఫోన్ నెంబరు బాధిత కుటుంబాలకు ఇచ్చిన విజయ్.. ఏ అవసరమై తనను కలవాల్సిందిగా కోరారు. కాగా విజయ్ రాక సందర్బంగా స్థానికంగా పెద్ద సంఖ్యలో జనం గుమ్మిగూడారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : puli  vijay  vijay visits fans houses  sridevi  kollywood  

Other Articles