Arrest order against Akbaruddin Owaisi for calling PM 'tyrant', 'devil'

Akbaruddins hate speech we face the case legally says asaduddin owaisi

asaduddin owaisi, akbaruddin owaisi, akbaruddin owaisi arrest, arrest akbaruddin, owaisi arrest, arrest owaisi, owaisi, akbaruddin arrest order, aimim, owaisi fir, fir against owaisi, latest news

An FIR was lodged against All India Majlis-e-Ittehad-ul Muslimeen (AIMIM) legislator Akbaruddin Owaisi by Kishanganj district administrationfor allegedly making inflammatory speech at an election rally in Kishanganj.

మళ్లీ అదే పని.. అడుసు తొక్కనేలా.. కాలు కడగనేలా..

Posted: 10/07/2015 01:59 PM IST
Akbaruddins hate speech we face the case legally says asaduddin owaisi

వివాదాలను ముద్దాడటం అయన ఇష్టమనుకుంటా.. అందుకే మరోమారు మళ్లీ అడుసు తోక్కాడు. గతంలో ఇదే తరహాలో హిందువులపై, గోమాంసం, గోవధపై రెచ్చగోట్టే వ్యాఖ్యాలు చేసి సంగారెడ్డి కోర్టులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించిన తరువాత కూడా మళ్లీ అలాంటి తరహలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకే చెల్లింది. మరోమారు ఆయనను అరెస్టు చేయాలని బీహార్ పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఇంతకీ ఎవరాయన..? అంటే ఆయననే ఎంఐఎం శాససనభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ.

బీహార్ ఎన్నికల నేపథ్యంలో అక్క ఏర్పాటు చేసిన ఓ సభలో మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రధాని మంత్రి నరేంద్రమోడీని దూషించి.. తూలనాడి.. ఎన్నికలలో లబ్ది పోందాలని యత్నించారు. మళ్లీ అదే అడుసు తొక్కారు. కాలు కడుక్కునేందుకు న్యాయపరంగానే ఎదుర్కోంటామని చెప్పుకోస్తున్నారు. కాగా అయనను అరెస్ట్ చేయాలని కిషన్గంజ్ జిల్లా పోలీసులు ఆదేశాలు జారీ చేయడంపై ఆయన సోదరుడు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని అసదుద్దీన్ అన్నారు. బిహార్లోని కిషన్గంజ్ పోలీసులు అక్బరుద్దీన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కిషన్గంజ్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ర్యాలీలో అక్బరుద్దీన్.. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asaduddin owaisi  akbaruddin owaisi  hate  speech  arrest warrant  MIM  bihar polls 2015  

Other Articles