Nasa Put Picture On facebook Account Of India Pakistan Border Which Is Shining With Lights | Indo Pak Border Photos

Nasa put picture india pakistan border which is shining with lights

indo pak border photos, indo pak border images, nasa put indo pak shining border images, indo pak border incidents, nasa put international images

Nasa Put Picture India Pakistan Border Which Is Shining With Lights : Nasa shared a photo of the international border between India and Pakistan as seen from outer space on their Facebook page on Sunday. An astronaut aboard the International Space Station took this nighttime panorama while looking north across Pakistan’s Indus River valley.

ఇండో-పాక్ బార్డర్.. ఓ అద్భుతమైన కనువిందు!

Posted: 10/06/2015 06:24 PM IST
Nasa put picture india pakistan border which is shining with lights

భారత్-పాకిస్థాన్ బార్డర్ లోని ఓ అద్భుతమైన దృశ్యం ప్రపంచ దృష్టినే తనవైపుకు ఆకర్షించింది. నిన్నటిదాకా చీకటిమయంగా వున్న ఈ బార్డర్ ప్రదేశం.. ఇప్పుడు వెలుగులతో వెదజల్లుతోంది. ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించి అబ్బురపరిచే ఫొటోను తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విడుదల చేసింది. అంతరిక్షం నుంచి చూస్తే ఇండో-పాక్ సరిహద్దు ఎలా వుంటుందో తెలిపే ఫొటోను నాసా ఆదివారం తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది.

రోదసిలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఓ వ్యోమగామి గత సెప్టెంబర్ 23న రాత్రి సమయంలో ఈ ఫొటో తీశారు. 28 మిల్లిమీటర్ల లెన్స్ కలిగిన నికన్ డీ4 డిజిటల్ కెమెరాతో ఉత్తర పాక్లోని ఇండస్ రివర్ వ్యాలీ మీదుగా భారత్ సరిహద్దు వరకు పానోరమ ఫొటోను క్లిక్ మనిపించారు. రాత్రి సమయంలోనూ భూమి మీదున్న అంతర్జాతీయ సరిహద్దుతోపాటు పలు ప్రాంతాలను ఈ ఫొటోలో స్పష్టంగా చూడవచ్చు. నారింజరంగులో వెలుగుతున్న భద్రత లైట్లు భారత్-పాక్ వేరు చేస్తున్న సరిహద్దును స్పష్టంగా చూపుతున్నాయి.

ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తున్న ఈ దృశ్యానికి సంబంధించి విస్తృతంగా చర్చలు కొనసాగుతున్నాయి. అటు పాక్ మీడియా కూడా ఈ బార్డర్ దృశ్యానికి సంబంధించి కథనాలు ప్రచురిస్తోందని తెలిసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nasa  indo pak border  

Other Articles