Conmen Used 580 Duplicate Credit Cards To Dupe Kotak Mahindra Bank Of 2.84 Crores Which Is Big Fraud | Bank Fraud Cases

Conmen 580 duplicate credit cards to dupe kotak mahindra bank nearly 3 crores

kotak mahindra bank fraud, kotak mahindra bank duped, 580 duplicate credit cards, fraudusters 3 crores duped, mahindra bank fraud news, duplicate credit card fraud case, online shopping frauds

Conmen 580 Duplicate Credit Cards To Dupe Kotak Mahindra Bank Nearly 3 Crores : The Kotak Mahindra Bank recently detected a massive fraud in which 1,730 transactions worth Rs 2.84 crore were carried out using credit cards it had never issued. The cards, 580 in all, were fabricated by the fraudsters and used for online shopping and making payments in seven countries.

580 నకిలీ కార్డులతో 2.84 కోట్లు స్వాహా..!

Posted: 10/06/2015 04:37 PM IST
Conmen 580 duplicate credit cards to dupe kotak mahindra bank nearly 3 crores

ప్రస్తుత ఆధునిక యుగంలో రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక సాంకేతిక రంగాన్ని కొందరు దుండగులు తమ స్వలాభాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. డబ్బులు సంపాదించడం కోసం పెడదారులు తొక్కుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. మొన్నటికిమొన్నే ఓ హైదరాబాదీ ‘ఈ-కామర్స్’ దిగ్గజం ‘ఫ్లిప్ కార్ట్’ను గత 20 నెలలుగా మోసం చేస్తూ రూ.20 లక్షలు దోచేసుకున్న ఘటన పోలీసులును కోలుకోలేని షాక్ కి గురి చేస్తే.. అంతకంటే మరో భారీ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. 580 నకిలీ కార్డులను సృష్టించిన దుండుగులు ఏకంగా 2.84 కోట్ల రూపాయల్ని స్వాహా చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాంకేతిక నైపుణ్యం కలిగిన కొందరు దుండగులు డబ్బుల్ని సులభంగా సంపాదించాలని, తనదైన రీతిలో బ్యాంకుల్ని మోసం చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వారు ముంబైలోని కోటక్ మహీంద్రా బ్యాంకును ఎంచుకున్నారు. కొత్త క్రెడిట్ కార్డులను ప్రింటింగ్ చేయడానికి గుర్గావ్‌లోని ఓ సంస్థకు కోటక్ మహీంద్రా బ్యాంకు ఆర్డర్ ఇచ్చింది. తమకున్న నైపుణ్యంతో ఆ దుండగులు నకిలీ క్రెడిట్ కార్డు ఎలా తయారుచేస్తారో తెలుసుకున్నారు. అంతే.. నకిలీ కార్డుల కిటుకు తెలుసుకున్న ఆ దుండగులు.. బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (బిన్)లో ఇంకా జారీచేయని కొత్త కార్డుల నుంచి డేటాను దొంగిలించి.. నకిలీ క్రెడిట్ కార్డులను క్రియేట్ చేశారు. అలా మొత్తం 580 క్రెడిట్ కార్డులను సృష్టించి.. దాదాపు 1730 అక్రమ లావాదేవీలు జరిపి రూ. 2.84 కోట్లను స్వాహా చేశారు. జూలై 2 - సెప్టెంబర్ 10 మధ్యకాలంలో ఆ దుండగులు ఇంత పెద్ద మోసానికి పాల్పడ్డారు. ఇండియాతోపాటు అమెరికా, బ్రిటన్, జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్ దేశాల్లో ఆన్‌లైన్ షాపింగ్, చెల్లింపు జరిపిన కేటుగాళ్లు తమ ఫ్రాడ్ మరో కంటికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

ఈ నకిలీ క్రెడిట్ కార్డుల వ్యవహారాన్ని పసిగట్టిన కోటక్ మహేంద్ర బ్యాంక్ యాజమాన్యం ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. తమకు తెలియకుండా 2.84 స్వాహా కావడంతో తలదించుకోవాల్సిన వంతయ్యింది. దీనిపై బ్యాంకు యాజమాన్యం ఈనెల 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రెడిట్ కార్డులపై ముద్రించిన పేర్లన్నీ నకిలీవేనని తేలింది. మాస్టర్ కార్డు నెట్‌వర్క్ ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని యాజమాన్యం పేర్కొంది. 580 నకిలీ కార్డులను సృష్టించడానికి దుండగులు చాకచక్యంగా బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ను వాడుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై దర్యాపు వేగవంతమైంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kotak mahindra bank Fraud  580 Duplicate Credit Cards  

Other Articles