Now Beer will avail till 11pm

Now beer will avail till 11pm

Telangana, Liquior, Wines, Beer, Bar, bar with permitt room

in Telangana state, The govt likely to open the Wines till 11pm. New Liquior policy facilatiing to open wines to 11pm in the night.

ఇక పదకొండైనా బీరు దొరుకుతుంది

Posted: 10/06/2015 01:16 PM IST
Now beer will avail till 11pm

అవును. మందు బాబుకు భలే హుషారు కలిగించే వార్త. రాత్రి పది దాటితే తాగడానికి నానా కష్టాలు పడే మందుబాబులకు గుడ్ న్యూస్. ఇక మీదట రాత్రి పది దాటితే బీర్ ఎక్కడ దొరుకుతుందా అని వెతకక్కర్లేదు. ఎక్కడ ఎంతకు బ్లాక్ లో బీర్ అమ్ముతారో ఆరా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకు అలా అనుకుంటున్నారా...? అధికారంలో ఉన్నది మామూలు సిఎం కాదు... కేసీఆర్. మరి మందు బాబుల బాగోగులు బాగా తెలిసిన సర్కార్ అధికారంలోకి రావడం మందు బాబులు చేసుకున్న పుణ్యం. గత జన్మలో ఎంతో మందు తాగి ఉంటే ఇలా తెలంగాణలో మందు బాబులకు కష్టాలు లేకుండా ఉంటుంది. అవును మరి అందుకే కేసీఆర్ జిందాబాద్ అని ప్రతి మందు బాబు అనాల్సిన టైం వచ్చింది.

మందు బాబుల కష్టాల తీర్చాడానికి కేసీఆర్ సర్కార్ కొత్తగా మందు పాలసీలో మార్పులు తీసుకురానుంది ఇప్పటికే చీప్ లిక్కర్ ను అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న సర్కార్ తాజాగా మరో అడుగు ముందు వేయబోతోంది. రాత్రి పది దాటితే చాలు మందు దొరకని పరిస్థితి నుండి దర్జాగా వైన్స్ లోనే మందు అదీ మామూలు రేట్ ను అందేలా చేస్తున్నారు. ఇప్పటికి రాత్రి పదింటి వరకు మాత్రమే అనుమత ఉన్న వైన్స్ ను ఇక మీదట రాత్రి పదకొండు దాకా నడిపించేందుకు ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుంది. మందు బాబులకు నిజంగా ఇది మంచి వార్తే కదా. మందు బాబుల రాజ్యం వర్దిల్లాలి అనుకునే పాలకులు సల్లంగుండాలి అని మందు బాబుల కోరిక న్యాయమైందే.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Liquior  Wines  Beer  Bar  bar with permitt room  

Other Articles