Naidu punchs cinema dialouges

Naidu punchs cinema dialouges at party meeting

Narachandrababu, Babu, AP, TDP, Telugudesam Party, Telangana

Narachandrababu Naidu punchs cinema dialouges at party meeting. Chandrababu Naidu gave warning to the party leaders, who got new positions in the party. He said that you have to work hark otherwise he dont loose them free.

సినిమా డైలాగ్ కొట్టిన చంద్రబాబు

Posted: 10/05/2015 07:57 AM IST
Naidu punchs cinema dialouges at party meeting

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మాట తీరు అదో స్టైల్లో ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడటం.. ఎవరు విన్నా వినకపోయినా తాను చెప్పాలనుకున్న దాన్ని చెప్పడం చంద్రబాబు నైజం. అయితే తర్వాత పరిస్థితులు కాస్త చంద్రబాబు నాయుడులో మార్పులు తీసుకువచ్చాయి. ఒకప్పుడు తాను చెప్పిందే వేదం అని చెప్పే వాళ్లు ఇప్పుడు మాత్రం అన్ని విషయాల మీద ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య సినిమా డైలాగులు రాజకీయ నోళ్లలో బాగా నానుతున్నాయి. రాననుకున్నారా.... రాలేకననుకున్నారా..? అంటూ బాలకృష్ణ సినిమాల్లో డైలాగులు చాలా మంది రాజకీయ నాయకులు వల్లిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా బాలకృష్ణ డైలాగ్ నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ ను కాదు అంటూ సవాల్ విసిరారు. తాజాగా చంద్రబాబు నాయుడు కూడా సినిమా డైలాగ్ వల్లించారు.

పార్టీలో అందరికి పదవులు ఇస్తున్నాం... అందరూ కష్టపడి పనిచేయాలి.. కష్టపడి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలి.. పదవులు ఇచ్చాను ఇక మీదట మిమ్మల్ని వదలను అంటూ చంద్రబాబు నాయుడు కొత్తగా పదవులు చేపట్టిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. అరుంధతి సినిమాలో సోనూ సూద్ లాగా నిన్ను వదల బమ్మాళీ అంటూ పార్టీ నాయకులకు అప్పుడే వార్నింగ్ లు ఇస్తున్నారు. పదవులు అలంకారానికి కాదు. పని చేయాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ పనితీరును నేను మదింపు చేస్తాను. మీకు ప్రోగ్రెస్‌ కార్డు ఇస్తాను. కమిటీలో నాయకుల మధ్య స్పష్టమైన పని విభజన జరగాలి. ఎవరి పని వారు చేయాలి. చేయలేకపోతే వెనుకబడిపోతారు. తర్వాత నన్ను అనుకొని లాభం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి పార్టీలో పదవులు తీసుకున్నట్లు కాదు పని చెయ్యాలి అంటూ స్మూత్ గా వార్నింగ్ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababu  Babu  AP  TDP  Telugudesam Party  Telangana  

Other Articles