scooty with petrol free for girl students in bihar

Bihar polls bjp promises to provide free petrol for scooty

Bihar Polls 2015, BJP free petrol for scooty, Free petrol for girls in Bihar, bihar elections, scooty with petrol free, students in bihar, BJP election promise, bihar elections Latest news,

In a bid to make their poll sop more attractive, BJP today said it would also provide free petrol for the two-wheelers for two years, which they will give to 5,000 meritorious girls passing class X and XII examinations

వారేవ్వా..! బీహార్ ఎన్నికల నేపథ్యంలో.. బీజేపీ ప్రకటన అదిరింది..

Posted: 10/04/2015 03:58 PM IST
Bihar polls bjp promises to provide free petrol for scooty

బిహార్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో విజయాన్ని అందుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఎన్డీయే కూటమి.. మరో ప్రజాకర్షక హామీని ప్రకటించింది. గెలుపు కోసం హామీలను గుప్పించడం తప్పులేదని భావిస్తున్న పార్టీలు తాము అధికారంలోకి వస్తే అరచేతిలో వైకుంఠాన్ని చూపెడతామని హామీలు గుప్పించడం మామూలే. అయితే ఈ ఎన్నికల హామీలలో భాగంగా పది, పన్నెండో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5,000 మంది విద్యార్థినులకు స్కూటీలను ఇస్తామని ఇదివరకే ప్రకటించిన ఎన్డీయే కూటమి.. ఇప్పుడు తాజా మరో బంపర్ ఆపర్ ను కూడా ప్రకటించింది.

బీహార్ ఎన్నికలలో రెండు కూటములు సమఉజ్జీలుగా వున్నాయని.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కాస్తా మెరుగ్గా వుందని.. ఒకటి నుంచి రెండు శాతం మేర ఓట్లను ఎన్డీయే కూటమి అధికంగా అర్జిస్తుందని ఇటీవల రెండు వేర్వేరు సర్వేలు స్పష్టం చేయడంతో.. ఎలాగైనా విజయాన్ని సాధించాలని.. విద్యార్థినులకు, వారి తల్లిదండ్రుల ఓట్లకు గాలం వేసుందుకు తాజాగా బీజేపి మరో బంఫర్ అఫర్ ను ప్రకటించింది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు రెండేళ్ల పాటు పెట్రోలును కూడా ఉచితంగా ఇస్తామని బీజేపి పార్టీ తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ నేత సుశీల్ మోదీ వెల్లడించారు. విద్యార్థినులకు స్కూటీ ఇస్తే అవి నడవడానికి పెట్రోలు ఎవరిస్తారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ విమర్శించిన నేపథ్యంలో సుశీల్‌మోదీ ఈ వాగ్దానాన్ని ఇచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar elections  scooty with petrol free  students in bihar  BJP election promise  

Other Articles