Nadigar Sangam elections: Sarath Kumar slams Kamal Haasan over joining rival group

Kamal haasan is ungrateful sarathkumar

sarath kumar,kamal haasan,nadigar sangam, SarathKumar slams KamalHaasan,nadigar sangam elections,sarath kumar kamal haasan,pandavar ani,Nasser

The battle between the two factions of Nadigar Sangam (actors' guild) in Tamil Nadu is heating up with president Sarath Kumar slamming Kamal Haasan after the star joined hands with rival group Pandavar Ani led by Nasser.

కమల్ హాసన్ కృతఘ్నుడిగా అభివర్ణించిన శరత్ కుమార్

Posted: 10/04/2015 02:46 PM IST
Kamal haasan is ungrateful sarathkumar

తమిళనాడు చిత్రపరిశ్రమ నటీనటులు ఏర్పాటు చేసుకున్న తమ సంక్షేమ సంఘం నడిగర్‌సంఘం ఎన్నికలు ఇద్దరు ప్రముఖ హీరోల మధ్యను అగ్ని రాజేశాయి. ఎంతలా అంటే.. వారి స్థాయిని మర్చిపోయిమరీ.. మీడియా సాక్షిగా ఒకరినోకరు దూషణపర్వం చేపట్టే వరకు వెళ్లింది. తెలుగు చిత్రపరిశ్రమ టాలీవుడ్ కు ఇటీవల జరిగిన ఎన్నికలకు సనీకళామతల్లి బిడ్డలను తాత్కాలికంగా విడదీసీ..రణరంగాన్ని తలపించగా, ఇప్పుడు నడిగర్ సంఘం ఎన్నిలకు కాలీవుడ్ లో అంతకన్నా పెద్ద స్థాయిలోనే వివాదాలను తెరపైకి తీసుకోస్తున్నాయి. ఈ ఎన్నికలు ఈ నెల 18న జరగనున్న నేపథ్యంలో ఇక పోటీకి దిగిన ఉభయ వర్గాలవారు..తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు.

తాజాగా ప్రముఖ నటుడు కమలహాసన్ కృతజ్ఞత లేని వారు. చేసిన మేలు మరచిన కృతఘ్నుడు అని నటుడు శరత్‌కుమార్ దుయ్యబట్టారు. ఆయన చేసిన మేలు మరచేవాడని దుయ్యబట్టారు. కమలహాసన్ నటించిన విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో సమస్యలు ఎదురైప్పుడు తాను సాయం చేశానన్నారు. అదేవిధంగా ఉత్తమవిలన్ చిత్ర విడుదలప్పుడూ తన భార్య రాధికా సాయం చేశారన్నారు. అలాంటిది నడిగర్‌సంఘం ఎలాంటి సాయం చేయలేదని కమల్ అనడం కృతజ్ఞతా హీనంగా పేర్కొన్నారు. కాగా ఈ ఎన్నికల్లో కమలహాసన్ తమ పోటీ జట్టుకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని శరత్‌కుమార్ ఆరోపించారు. ఇదిలావుండగా, ఒక ఫిలిం ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు నిర్వహించిన సర్వేలో విశాల్ జట్టుకు 64 శాతం, శరత్‌కుమార్ జట్టుకు 26 శాతం ఓట్లు పడతాయని పేర్కొనింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sarath kumar  kamal haasan  nadigar sangam elections  

Other Articles